సిమెంట్‌ షేర్లకు సుప్రీం రిలీఫ్‌!

సిమెంట్‌ షేర్లకు సుప్రీం రిలీఫ్‌!

సిమెంట్‌ పరిశ్రమలో పెట్‌కోక్‌ వినియోగానికి తాజాగా సుప్రీం కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో సిమెంట్ రంగ షేర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా గతంలో ప్రభుత్వం పెట్‌ కోక్‌ వినియోగాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. కాగా... దేశీయంగా పరిశ్రమలకు అవసరమయ్యే పెట్‌కోక్‌ పరిమాణంలో సగానికిపైగా దిగుమతుల ద్వారానే లభిస్తుండటం గమనించదగ్గ అంశం. 
ప్రస్తుతం సిమెంట్‌ రంగ షేర్లు బర్న్‌పూర్‌, హైడెల్‌బర్గ్‌, శ్రీ సిమెంట్, జేకే లక్ష్మీ, ప్రిజమ్‌, మంగళం, అంబుజా, అల్ట్రాటెక్‌, ఇండియా సిమెంట్స్‌ తదితరాలు 5-2 శాతం మధ్య పెరిగి  ట్రేడవుతున్నాయి.  Most Popular