మార్కెట్లు ప్లస్‌- చిన్న షేర్లు ఓకే!

మార్కెట్లు ప్లస్‌- చిన్న షేర్లు ఓకే!

తొలుత నష్టాలతో ప్రారంభమైనప్పటికీ లాభాల టర్న్‌అరౌండ్‌ అయిన మార్కెట్లలో చిన్న షేర్లకు ఓమోస్తరు డిమాండ్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 123 పాయింట్లు పెరిగి 33,351కు చేరగా.. నిఫ్టీ 45 పాయింట్లు ఎగసి 10,285 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.15 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ 0.3 శాతం బలపడింది.
లాభపడ్డవే ఎక్కువ
బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1364 లాభపడితే.. 1077 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ప్రభాత్‌, ఏవీటీ నేచురల్‌, జీఎం బ్రూవరీస్‌, పీపీఏపీ ఆటో, ఆర్‌పీజీ లైఫ్‌, పిన్‌కాన్‌, వాటర్‌బేస్‌, గొదావరీ పవర్‌, స్టార్‌ పేపర్‌, పుంజ్‌ లాయిడ్‌, జువారీ, మాంటె కార్లో, నిట్కో, క్రిధాన్‌ ఇన్ఫ్రా, హింద్‌ కాపర్‌ తదతరాలు 14-6 శాతం మధ్య దూసుకెళ్లాయి. Most Popular