టేకోవర్‌-మోనట్‌ ఇస్పాత్‌ అప్‌!

టేకోవర్‌-మోనట్‌ ఇస్పాత్‌ అప్‌!

అయాన్‌ కేపిటల్‌ పార్టనర్స్‌తో జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేసిన కన్సార్షియం టేకోవర్‌ చేయనుందన్న అంచనాలతో మోనట్‌ ఇస్పాత్‌ అండ్‌ ఎనర్జీ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు దాదాపు 3 శాతం పెరిగి రూ. 34.30 వద్ద ట్రేడవుతోంది. 
రుణ సమస్యల్లో ఇరుక్కున్న మోనట్‌పై దివాళా చట్టం ప్రకారం చర్యలు ప్రారంభించిన ఆర్‌బీఐ కంపెనీ విక్రయానికి వీలుగా తొలి దశలో 12 కంపెనీలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీటిలో జేఎస్‌డబ్ల్యూ కన్సార్షియం ముందువరుసలో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.Most Popular