సుప్రీం స్టేతో యూనిటెక్‌ షేరుకి షాక్!

సుప్రీం స్టేతో యూనిటెక్‌ షేరుకి షాక్!

రియల్టీ సంస్థ యూనిటెక్‌ బోర్డుకి వ్యతిరేకంగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో ఈ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో యూనిటెక్‌ షేరు దాదాపు 14 శాతం పతనమైంది. రూ. 6.64 వద్ద ట్రేడవుతోంది. 
గత వారం చివర్లో రియల్టీ సంస్థ యూనిటెక్‌ బోర్డును రద్దు చేయడంతోపాటు ప్రభుత్వం తరఫున నామినీలను నియమించేందుకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను నిలుపుదల చేయమని అభ్యర్థిస్తూ యూనిటెక్‌ ప్రస్తుత యాజమాన్యం సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా.. యూనిటెక్‌ బోర్డు రద్దు వార్తలతో గత మూడు రోజుల్లో ఈ షేరు 35 శాతం ర్యాలీ చేయడం గమనించదగ్గ విషయం!Most Popular