మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్స్‌ వీక్‌!

మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్స్‌ వీక్‌!

రిటైల్‌ ధరలు బలపడటం, పారిశ్రామికోత్పత్తి క్షీణించడం వంటి ప్రతికూల అంశాల కారణంగా వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌  45 పాయింట్లు తక్కువగా 33,183కు చేరగా.. నిఫ్టీ 10 పాయింట్లు క్షీణించి 10,230 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ రంగాలు 0.6-0.3 శాతం మధ్య నీరసించాయి.
బ్లూచిప్స్‌ తీరిలా
నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, యూపీఎల్‌, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ 2-1 శాతం మధ్య తిరోగమించాయి. మరోవైపు హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, బీపీసీఎల్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, టెక్‌ మహీంద్రా, భారతీ, ఎంఅండ్‌ఎం 2-0.5 శాతం మధ్య ఎగశాయి.Most Popular