లాభనష్టాల మధ్య ఆసియా మార్కెట్లు !

లాభనష్టాల మధ్య ఆసియా మార్కెట్లు !

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రెండు రోజుల పాలసీ సమావేశ నిర్ణయాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది.  ఈసారి సమీక్షలో కనీసం పావు శాతం వడ్డీ రేటును పెంచే అంచనాలు బలపడటంతో డాలరు రెండు నెలల గరిష్టం 94కు బలపడగా.. గోల్డ్‌మన్‌ శాక్స్‌ తదితర బ్యాంకింగ్ దిగ్గజాలు పుంజుకోవడంతో మంగళవారం డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ లాభాలతో ముగిశాయి. కాగా.. ఈ వారంలోనే ఈసీబీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ తదితర కేంద్ర బ్యాంకులు పరపతి విధాన సమీక్షలు చేపట్టనుండటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
అటూఇటుగా
ప్రస్తుతం ఆసియా స్టాక్‌ మార్కెట్లలో జపాన్‌, సింగపూర్‌, చైనా, ఇండొనేసియా 0.5-0.1 శాతం మధ్య నష్టాలతో ట్రేడవుతుంటే.. కొరియా, హాంకాంగ్‌, తైవాన్‌, థాయ్‌లాండ్‌  0.5-0.2 శాతం మధ్య లాభాలతో కదులుతున్నాయి. Most Popular