డోజోన్స్‌కు బ్యాంకింగ్‌ బలం!

డోజోన్స్‌కు బ్యాంకింగ్‌ బలం!

బ్యాంకింగ్‌ దిగ్గజాలు అండగా నిలవడంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. రెండు రోజుల ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశ నిర్ణయాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో డాలరు సైతం నెల రోజుల గరిష్టం 94కు బలపడింది. ఈ నేపథ్యంలో డోజోన్స్‌ 119 పాయింట్లు(0.5 శాతం) పెరిగి 24,505 వద్ద నిలిచింది. తద్వారా 24,500 మార్క్‌ను అధిగమించింది. ఎస్‌అండ్‌పీ సైతం 4  పాయింట్లు(0.15 శాతం) బలపడి 2,664 వద్ద ముగిసింది. అయితే నాస్‌డాక్‌ 13 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 6,862 వద్ద స్థిరపడింది. 
బ్లూచిప్స్‌ దన్ను
మార్కెట్లకు ప్రధానంగా గోల్డ్‌మన్‌ శాక్స్‌ 3 శాతం జంప్‌చేయడం ద్వారా అండగా నిలవగా 2.4 శాతం ఎగసిన బోయింగ్‌ మరోపక్క దన్నునిచ్చింది. డివిడెండ్‌ను 20 శాతం పెంచడంతోపాటు, 18 బిలియన్‌ డాలర్లతో షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించడం బోయింగ్‌కు బలాన్నిచ్చింది. అయితే యాపిల్‌, ఫేస్‌బుక్‌ తదితర టెక్నాలజీ బ్లూచిప్స్‌ డీలాపడటంతో నాస్‌డాక్‌ బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular