బ్యాంకుల్లో సొమ్ము భద్రం కాదా..? అసలు ఈ ప్రచారంలో నిజమెంత ?

బ్యాంకుల్లో సొమ్ము భద్రం కాదా..? అసలు ఈ ప్రచారంలో నిజమెంత ?

ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ అంటే ఏంటి ఇప్పుడు బాగా కలకలం రేపుతోన్న అంశం. బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే, ఇక డబ్బులు ఎప్పుడైనా వాళ్లే వాడుకుంటారట కదా  అనే విధంగా ప్రచారం జరుగుతోంది కూడా! 
అప్పుడే ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ పిటీషన్లు కూడా తయారవుతున్నాయ్. కేంద్రం ఎంతగా సర్దిచెప్పాలని చూస్తున్నా, జనంలో ఆందోళన మాత్రం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. change.org లాంటి ఆన్ లైన్ పిటీషన్లకి ఇప్పటికే మద్దతుగా 70వేలమందికి పైగా సంతకాలు చేయడం ఈ ఆందోళన ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. అమాయకులైన జనం డబ్బులను మీ అవసరాలకోసం వాడేసుకోవద్దు ('Do not use innocent depositors' )అనే టైటిల్‌తో ఈ పిటీషన్ సర్క్యులేట్  అవుతోంది. ఈ బిల్లుతో బ్యాంకులు దివాలా స్థితికి చేరినప్పుడు డిపాజిటర్ల అనుమతితో సంబంధం లేకుండానే వారి డబ్బుని వాడుకునేలా వెసులుబాటు కలుగుతుంది. ఇదీ జనంలో ఉన్న అభిప్రాయం.

బెయిల్ ఇన్ అనే సవరణతో ఈ FRDI బిల్లు రాబోతోంది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో లోక్‌సభలో ఈ బిల్లు జాయింట్ కమిటీ ముందుకు వెళ్లింది. ఈ చలికాల సమావేశాలకు పార్లమెంట్ ముందుకు రావాల్సి ఉఁడగా..సెషన్ల వాయిదాతో వాయిదా పడింది. ఈ బిల్లు ఆమోదం పొందితే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశాలతో ఓ కార్పోరేషన్ ఏర్పాటు అవుతుంది. అది  ఆర్ధికసేవలందించే సంస్థల ఆస్తులను బదిలీ చేయడం లేదంటే విక్రయించే హక్కులు దఖలు పడతాయి.
ఐతే ఈ కార్పోరేషన్ ఏర్పాటు వలన  బ్యాంకుల ఆర్ధిక స్థితి బాలేని పరిస్థితుల్లో బ్యాంకుల్లోని డిపాజిట్లకి ఇన్సూరెన్స్ సౌకర్యం కలుగుతుంది. ఐతే లక్షరూపాయలు దాటిన డిపాజిట్లకు మాత్రమే ఇప్పటిదాకా ఇలాంటి బీమా సౌకర్యం ఉంది. ఐతే బెయిల్ ఇన్ నిబంధన వలన బ్యాంకుల అప్పులు  రద్దు కావడంతో పాటు, ఆస్తుల బదిలీకి కూడా వీలు కలుగుతుంది. ఇదే ఇప్పుడు డిపాజిటర్లలో అనుమానానికి తావిస్తోంది. ఐతే కేంద్రం మాత్రం ఇప్పటికే ఉన్న రక్షణ సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తుందే తప్ప జనం డబ్బులు పోతాయనే వాదనకి అర్ధం లేదని చెప్తోంది. Most Popular