స్మైల్‌తో లాభాలు దండుకోవచ్చు: విజయ్ కేడియా చెప్పే 3 స్టాక్స్ చూడండి

స్మైల్‌తో లాభాలు దండుకోవచ్చు: విజయ్ కేడియా చెప్పే 3 స్టాక్స్ చూడండి

ఇప్పుడు నడుస్తోంది బుల్ రన్ అని చాలామంది అనలిస్టులు చెప్తున్నారు. వారితో పాటే విజయ్ కేడియాలాంటి ఏస్ ఇన్వెస్టర్లు కూడా అదే మాట చెప్తున్నారు, కేడియాను మల్టీ బ్యాగర్ స్పెషలిస్టుగా పిలుస్తారు కూడాకేడియా అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం అతి పెద్ద బుల్ రన్ నడుస్తోంది. అందులో మొదటి దశ 2003-08 వరకూ ఉండగా, రెండో దశ 2014నుంచి ప్రారంభమై నడుస్తోంది..అంటే మనం బుల్ రన్ మధ్య దశలో ఉన్నాం. కాబట్టి..ఇంకా మెుదలు కాని మూడో దశ ఇంకా చాలా ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టొచ్చనేది కేడియా ఒపీనియన్. ఐతే ఆయన ఎలాంటి స్టాక్స్ ఏ పద్దతిలో ఎంపిక చేసుకుంటారనేది అందరికీ ఆసక్తి కలిగించే అంశమే. ఇందుకోసం మన పోర్ట్‌ఫోలియోలో ఖచ్చితంగా స్మైల్ ఉంటే లాభాలను దండుకోవచ్చనేది ఆయన చెప్తారు..ఇంతకీ స్మైల్ అంటే ఏంటి చిరునవ్వేనా..కాదు..అదో ఐదు అంశాల సమ్మిళతమైన సూత్రం


S-అంటే స్మాల్ ఇన్ సైజ్
M-మీడియం ఇన్ ఎక్స్‌పీరియెన్స్
I-ఇన్వెస్ట్‌మెంట్ ఫిలాసఫీ
L-లార్జ్ ఇన్ యాస్పిరేషన్
E-ఎక్స్ ట్రా లార్జ్ మార్కెట్ పొటెన్షియల్
పైన చెప్పిన అఁశాలను దృష్టిలో పెట్టుకుని స్టాక్స్ కొనుగోలు చేస్తే మంచిదని విజయ్ కేడియా చెప్తారు. ఆయన పోర్ట్ ఫోలియా విషయానికి వస్తే, రెప్రో ఇఁడియా, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, సుదర్శన్ కెమికల్స్, ఏరీస్ ఆగ్రో ఉన్నాయ్. ఏబిసి బేరింగ్స్, వైభవ్ గ్లోబల్, ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్, సెరా శానిటరీ, కర్నాటక బ్యాంక్, టిసిపిఎల్ ప్యాకేజింగ్‌లలో విజయ్ కేడియాకి 1శాతానికిపైగా వాటా ఉంది
రెప్రోఇండియా: 111% +
6.78శాతం వాటా విజయ్ కేడియాకి ఉన్న ఈ కంపెనీ ఈ ఏడాది ఇప్పటికే 111శాతం పెరిగింది. ప్రింటింగ్ ఇండస్ట్రీలో మార్కెట్ సైజుని అంచనా వేసుకున్న కంపెనీ ఇంకా విస్తరించేందుకు వ్యూహాలు సిధ్దం చేసుకుంది. 2022నాటికి ఈ సంస్థ రూ.12-15వేల కోట్ల రెవెన్యూ సాధిస్తుందని అంచనా. ప్రస్తుతం సంస్థ అమ్మకాలు రూ.20-40కోట్లవరకూ ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో తన వ్యాపారం ఎలా  చేస్తుందనే అంశం ఒక్కటే కీలకంకాగా, ఇవాళ్టి మార్కెట్‌లో 20శాతం అప్పర్ సర్క్యూట్ పడటం గమనార్హం
సుదర్శన్ కెమికల్స్ : 27%+
సుదర్శన్ కెమికల్స్ సంస్థలో విజయ్ కేడియాకు 3.5శాతం వాటా ఉంది. గత రెండేళ్లుగా ఈ సంస్థ షేరు మూడు రెట్లు పెరగగా..ఈ ఏడాది ఇంకా పెరుగుతూనే ఉంది. పిగ్మెంట్ రంగంలో సుదర్శన్ కెమికల్స్ మూడో పెద్ద సంస్థగా చెప్తారు
ఏరిస్ ఆగ్రో: 104%+
కేడియా హోల్డింగ్స్‌కి ఏరిస్ ఆగ్రోలో 5శాతం వాటా ఉంది. మైక్రో న్యూట్రియంట్స్(సూక్ష్మ పోషకాలు) వ్యాపారంలో ఉన్న ఏరిస్ ఆగ్రోకి పోటీగా ర్యాలీస్, కోరమాండల్ ఉన్నా..వాటికి ఇతర అమ్మకాలు కూడా ఉండటం వలన ఈ రంగంలో ఏరిస్ ఆగ్రోనే మెయిన్ ప్లేయర్. 
( పైన చెప్పిన స్టాక్స్‌ని ప్రాఫిట్ యువర్ ట్రేడ్.ఇన్ సైట్ రికమండ్ చేయలేదు)
 Most Popular