హైవేస్ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ పై జాతీయ సదస్సు ప్రారంభించిన సీఐఐ

హైవేస్ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ పై జాతీయ సదస్సు ప్రారంభించిన సీఐఐ

 

 సీఐఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం పై ఓ జాతీయ సదస్సుకు హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ వేదిక అయ్యింది. రెండురోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో రహదారుల నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానంలో వినూత్నత, భద్రత, వేగం, రహదారి నిర్వహణ అనే అంశంపై  ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారని సీఐఐ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 వేల కిలోమీటర్ల మేర హైవేల నిర్మాణం పూర్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని....రోజుకు 50 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పరిశ్రమకు సాధ్యమేనని మినిష్టరీ ఆఫ్ ట్నాన్స్ ఫోర్ట్ అండ్ హైవేస్ చీఫ్ ఇంజనీర్ కౌషిక్ బసు అన్నారు. ఈ ఏడాది రోజుకి 17 కిలో మీటర్ల హైవే రోడ్ల నిర్మాణం జరిగిందని, టెక్నాలజీని ఉపయోగించి రోజుకి 50 కిలోమీటర్ల రోడ్లు నిర్మించడం పెద్ద కష్టమైన పనేం కాదని, భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు. సదస్సులో ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌ రాఘవ్‌ చంద్ర సహా ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు దాదాపు 300 మంది హాజరైయ్యారు.. రోజుకి 50 కిలోమీటర్ల హైవే రోడ్ల నిర్మాణం అనే లక్ష్యాన్ని చేరడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో సదస్సులో చర్చించారు.  రహదారి నిర్మాణ కంపెనీలు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్‌లు , పరిశ్రమ భాగస్వాములు ఈ సదస్సులో తమ ప్రంజంటేషన్స్ అందించారు. ఈ సందర్భంగా నిర్మాణ రంగ కంపెనీలు తమ ఉత్పత్తులతో ప్రదర్శన ఏర్పాటు చేశాయి.Most Popular