టాప్ టెన్ బెటర్ స్టాక్స్ ఇన్ 2018( న్యూ లిస్టెడ్ స్టాక్స్)

టాప్ టెన్ బెటర్ స్టాక్స్ ఇన్ 2018( న్యూ లిస్టెడ్ స్టాక్స్)

బ్యాంక్ ఆప్ అమెరికా మెరిల్ లించ్ అంచనా ప్రకారం వచ్చే ఏడాది సెన్సెక్స్ 32వేల పాయింట్ల రేంజ్‌లోనే ట్రేడవుతుంది. అంటే ఇక ఇప్పుడున్న లెవల్ నుంచి పెద్దగా పెరగకపోవచ్చనేది ఆ  సంస్థ అంచనా. మరిలాంటప్పుడు ఏ స్టాక్స్ కొంటే లాభం వస్తుందో వెతకడం కష్టమైన పనే ఈ దశలో కొత్తగా లిస్టైన షేర్లలో ఓ పది షేర్లు వచ్చే కేలండర్ ఇయర్‌లో మంచి పెర్ఫామెన్స్ ఇస్తాయని అంటున్నారు. వాటిని చూద్దాం

Solar Industries: BUY| Target Rs 1,537| Return 35 percent
వెంచురా సెక్యూరిటీస్ సోలార్ ఇండస్ట్రీస్‌ని బయ్ కాల్ ఇవ్వడంతో పాటు కవరేజీ ఇనిషియేట్ చేసింది. ఇది 12 నెలలకాలంలో రూ.1537కి పెరుగుతుందని సూచిస్తోంది
ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్‌ప్లోజివ్స్, డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ తయారీలో నంబర్ వన్ సోలార్ ఇండస్ట్రీస్. గత 11ఏళ్లుగా 23.8శాతం కాంపౌండ్ యాన్యువర్ గ్రోత్ రేటు మెయిన్ ‌టైన్ చేస్తోన్న
అతి కొద్ది సంస్థల్లో ఇది కూడా ఒకటి. అంతర్జాతీయంగా విస్తరణ వ్యూహాలు ఉండటంతో స్టాక్ మంచి మొమెంటమ్ కనబరుస్తుందని అంచనా. రానున్న మూడేళ్లలో ఈ సంస్థ రెవెన్యూ
రూ.1579కోట్ల నుంచి రూ.3134కోట్లకి పెరుగుతుదంని వెంచురా సెక్యురిటీస్ అంచనా వేస్తోంది

ION Exchange: BUY| Target Rs 6,16| Return 48 percent
ఇండియా నివేష్ సంస్థ ఐయాన్ ఎక్స్ఛేంజ్‌కి రూ.616 టార్గెట్ ఫిక్స్ చేసింది. ఆదాయం రాబట్టే పద్దతులు, వృధ్ది రేటులో నిలకడతో ఈ కంపెనీ 21.6శాతం నుంచి 29.9శాతం అంటే దాదాపు 30శాతం సిఏజిఆర్ నమోదు చేస్తుందని రీసెర్చ్ సంస్థ చెప్తోంది. ఇప్పుడు నిర్దేశించిన ధర రూ.616 2020 ఆర్ధిక సంవత్సరానికి 16.4రెట్లతో సమానం

SIS: BUY| Target Rs 1,300| Return 21  percent
ఇండియా ఇన్ఫోలైన్ ఈక్విటీస్ రీసెర్చ్ ఎస్ఐఎస్‌కి 16నెలల కాల వ్యవధిలో రూ.1300కి పెరుగుతుందని రికమండేషన్ ఇచ్చింది. సెక్యూరిటీ సర్వీసెస్ రంగంలో వేగంగా వృధ్ది చెందుతోన్న ఎస్ఐఎస్ , ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ రంగంలోకీ ప్రవేశించింది. 44శాతం ఈపిఎస్ సిఏజిఆర్‌తో రానున్న మూడేళ్లలో సంస్థ రెవెన్యూ 21శాతం వృధ్ధి నమోదు అవుతుందని ఐఐఎఫ్ఎల్ అంచనా వేస్తోంది. అలానే సెక్షన్ 80JJAA కింద పన్ను మినహాయింపు దక్కడం ఈ సంస్థకి మరో అడ్వాంటేజ్

Kirloskar Ferrous: BUY| Target Rs 155| Return 41 percent 
కిర్లోస్కర్ బ్రదర్స్ గ్రూపు కంపెనీ అయిన కిర్లోస్కర్ ఫెర్రస్ కి సెంట్రమ్ బ్రోకింగ్ కవరేజీ ఇనిషియేట్ చేసింది. రూ.155 టార్గెట్ ప్రైస్‌తో ఈ సంస్థ షేరును కొనవచ్చిని సూచించింది.గ్రే  ఐరన్, గ్రాఫైట్ ఐరన్ కేస్టింగ్ రంగంలో తిరుగులేని ఆధిపత్యం సాధించింది కిర్లోస్కర్ ఫెర్రస్. రానున్న మూడేళ్లలో ఎబిటా 28శాతం, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సిఎజిఆర్ 29శాతం పెరుగుతాయని ఊహిస్తోంది. దీంతో సేల్స్ లో 19శాతం సిఏజిఆర్ నమోదు అవుతుందని సెంట్రమ్ చెప్తోంది. రాబడి, లాభాల్లో మంచి జంప్ కన్పిస్తుందని కూడా అంచనా వేస్తోంది

Ganesha Ecosphere: BUY| Target Rs 486| Return 25 percent
ఇండియా నివేష్ గణేష్ ఎకోస్పియర్‌కి రూ.486 టార్గెట్ ప్రైస్ ఫిక్స్ చేసింది. రీసైకిల్డ్ వస్తువుల తయారీలో అగ్రభాగంలో గణేషా ఎకోస్పియర్ కొనసాగుతోంది. పాలీఎథిలీన్ టెరాఫ్తలీట్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ 2017లో రూ.3500కోట్లకి ఎదగడం గమనార్హం. బలమైన నెట్వర్క్ వ్యవస్థ, విస్తరణ సామర్ధ్యాన్ని బట్టి మార్జిన్లు బాగా ఇంప్రూవ్ అవుతాయని ఇండియానివేష్ అంచనా వేస్తోంది

Sterlite Technologies: BUY| Target Rs 346| Return 23 percent
జిఈపిఎల్ కేపిటల్ స్టెరిలైట్ టెక్నాలజీస్ ‌కి రూ.346 లక్ష్యధర నిర్దేశించింది. ఆప్టికల్ టెలికమ్యూనికేషన్ల ఉత్పత్తుల్లో స్టెరిలైట్ టెక్నాలజీస్‌కి మంచి పేరు ఉంది. జాతీయంగా అంతర్జాతీయంగా విస్తరించిన స్టెరిలైట్ కంపెనీ  కేవలం టెలికాం, ప్రొడక్ట్స సర్వీస్ రంగంలోనే పని చేస్తుంది. 

Varun Beverages: BUY| Target Rs 590| Return 17 percent
ఐసిఐసిఐ డైరక్ట్ వరుణ్ బెవరేజెస్‌కి బయ్ రేటింగ్‌తో పాటు రూ.590 టార్గెట్ ధర రికమండ్ చేస్తోంది. పెప్సీకో ఫ్రాంచైజీల్లో రెండో పెద్ద కంపెనీ అయిన వరుణ్ బెవరేజెస్ సిఎస్‌డి, ఎన్‌సిబి ఉత్పత్తులను ఇండియా, నేపాల్, శ్రీలంక, మొరాకో, జాంబియాలో తయారు చేయడంతో పాటు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.

Talbros Automotive Components: BUY| Target Rs 353| Return 24 percent
ప్రస్తుతం కన్సాలిడేషన్ దశలో ఉన్న టాల్‌బ్రోస్ ఆటోమోటివ్ కంపోనెంట్స్ తొందర్లోనే బాగా పెరగడానికి రంగం సిధ్దమైంది. టెక్నికల్ ఛార్టుల ప్రకారం కంపెనీ గ్రోత్ ట్రాజెక్టరీ‌లో ఉన్నట్లు కన్పిస్తోంది. హీట్ షీల్డ్స్ తయారీ రంగంలోకి ప్రవేశించడం, కొత్త క్లయింట్లనుంచి ఎగుమతిఆర్డర్లు దక్కించుకోవడం వంటి అంశాలు రానున్న రోజుల్లో రెవెన్యూ పెరగడానికి దోహదపడే అంశాలు.  ఇంకా ఇతర సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 14శాతం సిఏజిఆర్‌తో రూ.328కోట్ల రెవెన్యూ సాధించింది. 2020నాటికి ఇది రూ.487కోట్లకి పెరుగుతుందని వెంచురా సెక్యూరిటీస్ అంచనా

Time Technoplast: BUY| Target Rs 230| Return 14 percent
ఐసిఐసిఐ డైరక్ట్  ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ రంగంలో లీడర్ అయిన టైమ్ టెక్నోప్లాస్ట్‌కి రూ.230 టార్గెట్ నిర్దేశించింది, కంపోజిట్ సిలిండర్ల తయారీలోనూ ఉన్న ఈ సంస్థ ఇటీవలే జియోగ్రఫీస్‌లో వాటా అమ్మకంతో రూ.300కోట్ల నిధులు సమీకరించింది. ఆ ధనాన్ని విస్తరణ కోసం వివిధ ఉత్పత్తుల కోసం వినియోగించనుంది. వేల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ( విలువ ఆధారిత వస్తువులు) ఉత్పత్తులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టనుండటంతో పాటుగా ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్ట్స్‌ని తగ్గించుకోనుంది. దీంతో టాప్‌లైన్‌లో 13శాతం పెరుగుదల, 2020నాటికి 23శాతం పెరుగుదల చోటు చేసుకుంటుందని ఐసిఐసిఐ డైరక్ట్ లెక్క గట్టింది.

SBI Life Insurance Company: BUY| Target Rs 760| Return 14 percent
ఐసిఐసిఐ డైరక్ట్ కొత్తగా లిస్టైన ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.760 టార్గెట్ ఫిక్స్ చేసింది. 2015-17 మధ్య బలమైన సిఏజిఆర్ 35.45శాతం నమోదుకాగా,  ప్రవేట్ ఇన్సూరెన్స్ రంగంలో 20శాతానికిపైగా వాటా కలిగి ఉంది. 24వేల బ్రాంచ్‌లు కలిగి ఉండటం కంపెనీ ఉత్పత్తుల విక్రయాలకు ప్రయోజనం.


(పైన చెప్పిన స్టాక్ రికమండేషన్స్ ఆయా బ్రోకరేజీ సంస్థలవి మాత్రమే. లాభనష్టాలకు ప్రాఫిట్ యువర్ ట్రేడ్. ఇన్ బాధ్యత వహించజాలదు)Most Popular