బంపర్ ప్రాఫిట్స్ కావాలంటే ఈ 3 స్టాక్స్ కొనాల్సిందే

బంపర్ ప్రాఫిట్స్ కావాలంటే ఈ 3 స్టాక్స్  కొనాల్సిందే

స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు కన్పిస్తున్నాయ్. ఇలాంటప్పుడే ఓ రంగం బాగా కలిసి వచ్చేలా కన్పిస్తోంది. ఈ మధ్యకాలంలో బాగా షైనవుతోన్న మెటల్ రంగ షేర్లలో స్టీల్ స్టాక్స్‌కి శుభశకునాలు కన్పిస్తున్నాయ్. ఇప్పుడున్న మార్కెట్ రేట్లలో కొన్నా కనీసం 40శాతం లాభం వచ్చే అవకాశాలనున్నాయని ఫిలిప్ కేపిటల్ చెప్తోంది. ఇంతకీ ఆ స్టాక్స్ ఏవో తెలుసా టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్ 

కారణమేంటో తెలుసా...చైనా దేశంలో స్టీల్ ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించడమే. పర్యావరణానికి హాని కలుగుతుందనే కారణంతో చైనా దేశపు సరిహద్దుల్లో  ఉక్కు తయారీ, మైనింగ్‌ని నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చైనాలోని 50శాతం ఉక్కు ఉత్పత్తి తగ్గుతుందని అంటున్నారు. ఈ నిర్ణయం వచ్చే మే, జూన్ నెలవరకూ కొనసాగుతుంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ధరలు పెరగడానికి దోహదపడుతున్నాయ్.  3 నెలలక్రితం భారీగా లాభపడిన టాటాస్టీల్ లాంటి కంపెనీలు ఈ పరిణామాలతో భారీగా లాభపడొచ్చని అంచనాలు బైల్దేరాయ్.  దీంతో  కాస్త జోరు తగ్గిన స్టీల్ తయారీ కంపెనీలు మళ్లీ పుంజుకోవచ్చని అనలిస్టులు కూడా అంటున్నారు . ఐరన్ ఓర్, కోక్ కోల్ ధరలు ఈ మధ్యనే కాస్త పెరుగుతూ వస్తున్నాయ్. కాబట్టి ఇక స్టీల్ రేటు కూడా 2018 జనవరి నుంచి పెరుగుతుందని అంచనా. మామూలుగా నాలుగో త్రైమాసికం స్టీల్ కంపెనీలకు మంచి లాభాలు పంచే సీజన్‌గా చెప్తారు. ఐతే తాజా పరిణామాలతో క్యు2లోనే ఈ లాభాలు నమోదు అవుతాయని..ఇతర దేశాల్లో డిమాండ్ పెరగడంతో ఏడాదంతా కూడా బావుంటుందని ఫిలిప్ కేపిటల్ అంచనా వేస్తోంది.
ఇక మన దేశం వరకూ వస్తే టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ భారీగా ఉక్కు తయారీలో ప్రసిధ్ది. అందుకే ఈ రెండు స్టాక్స్‌లో కనీసం 15 నుంచి 25శాతం వరకూ పెరుగుదల నమోదు కావచ్చని రీసెర్చ్ ఏజెన్సీ ఆంచనా వేస్తోంది.టాటా స్టీల్ డిసెంబర్ 7 నాటి ట్రేడింగ్‌లో దాదాపు 3శాతం లాభపడి రూ.687.90 వద్ద ముగిసింది. జెఎస్‌డబ్ల్యూ స్టీల్ 3.18శాతం లాభపడి రూ.250.15 వద్ద ముగిసింది. ఇక మరో స్టీల్ దిగ్గజం  స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టాక్ అయితే ఏకంగా 58శాతం వరకూ పెరగొచ్చని ఫిలిప్ ‌కేపిటల్ చెప్తోంది . సెయిల్ స్టాక్‌కి గతంలో ఇచ్చిన సెల్ రికమండేషన్ నుంచి బయ్ కి మార్చడంతో పాటు..రూ.120 టార్గెట్ ప్రైస్ ఫిక్స్ చేసింది ఫిలిప్ కేపిటల్. డిమాండ్ పెరిగేకొద్దీ సెయిల్ లాభం పెరుగుతో పోతుందని చెప్తోంది. ప్రభుత్వం సెయిల్ సామర్ధ్యాన్ని పెంచబోతుండటంతో, అది సెయిల్ కంపెనీకి బాగా లాభిస్తుందని అంచనా. మిగిలిన స్టీల్ స్టాక్స్ బాగా పెరుగుతున్నా కూడా సెయిల్ మాత్రం నష్టాలు ప్రకటించింది. తాజా పరిణామాలతో పరిస్థితి మారుతుందని అనలిస్టుల అభిప్రాయం. గురువారం నాటి ట్రేడింగ్‌లో సెయిల్ 3.69శాతం లాభపడి రూ.78.70 వద్ద ముగిసింది  పైన చెప్పిన మూడు స్టాక్స్ గత ఏడాదికాలంలో 45-60శాతం వరకూ పెరగగా..ఇప్పుడు మరో ర్యాలీకి సిధ్దమవుతున్నాయని ఫిలిప్ కేపిటల్ సూచిస్తోందిMost Popular