ఈ షేర్లు ప్రతి డిసెంబర్‌ నెలలో భలే లాభాలు పంచుతున్నాయ్

ఈ షేర్లు ప్రతి డిసెంబర్‌ నెలలో భలే లాభాలు పంచుతున్నాయ్

ఓ 7 స్టాక్స్ ప్రతి డిసెంబర్‌నెలలో మంచి లాభాలు ఇన్వెస్టర్లకు పంచుతున్నాయ్. సెంటిమెంట్‌కి పెట్టింది పేరైన స్టాక్‌మార్కెట్లలో మదుపరులకు ఇలా ఓ నెలలో రెండంకెల వృధ్ది సాధిస్తోన్న షేర్లు మంచి ఆసక్తినే కలిగిస్తాయి. 
అలా  గత  ఐదేళ్లలో నాలుగేళ్ళు రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ చూద్దాం. వాటిలో కొన్ని 54శాతం పెరగడం విశేషం. ఈ షేర్లు పంచిన లాభాలను బట్టి మనం దాన్ని శాంతాక్లజ్ ర్యాలీగా మనం పిలుచుకోవచ్చు కూడా ఆ ఏడు కంపెనీలు అలంకిత్, ఛౌగులే స్టీమ్, హెచ్‌బిఎల్ పవర్ సిస్టమ్స్, 3ఐ ఇన్ఫోటెక్, బార్‌ట్రానిక్స్ ఇండియా, వికాస్ ఎకోటెక్, మహామాయా స్టీల్ 
పైన చెప్పిన స్టాక్స్‌లో అలంకిత్ గత ఐదేళ్లూ డిసెంబర్ నెలలో డబల్ డిజిట్ గ్రోత్ నమోదు చేసింది. ఛౌగులే స్టీమ్‌షిప్స్ కూడా అంతే. ఈ-గవర్నెన్స్ సెక్టార్‌లో సర్వీసు ప్రొవైడర్‌గదా ఉన్న అలంకిత్ పాన్ కార్డులకు టిన్ ఫెసిలిటేషన్ సెంటర్ సర్వీసుతో పాటు, ఆధార్, ఆధార్ సీడింగ్, పివిసి ఆధార్ కార్డుల ప్రింటింగ్ వంటి సేవలు అందిస్తోంది. 
3ఐ ఇన్ఫోటెక్  గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థగా ఇతర కంపెనీలకు బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో సేవలు అందిస్తోంది. ప్రభుత్వరంగ సేవలతో పాటు, తయారీ, రిటైల్, డిస్ట్రిబ్యూషన్, టెలికాం, హెల్త్‌కేర్ సెక్టార్లకి కూడా 3 ఐ ఇన్ఫోటెక్ సేవలందిస్తోంది
బ్యాటరీల తయారులో ఉన్న హెచ్‌బిఎల్ పవర్ సిస్టమ్స్ డిసెంబర్ నెలలో 31శాతం వరకూ లాభాలు పంచుతోంది. ఈ కంపెనీ వ్యాపార రంగంలో 1977నుంచి ఉండటం విశేషం. ఎయిర్‌క్రాఫ్ట్ బ్యాటరీలు కూడా వీరి వేరియంట్లలో కొన్ని
బార్‌ట్రానిక్స్ బార్ కోడింగ్, స్మార్ట్ కార్డ్ టెక్నాలజీలో దిట్ట. ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్, డేటా కేప్చర్‌లో ఈ మధ్యనే ఎంట్రీ ఇచ్చింది బార్‌ట్రానిక్స్ 
వికాస్ ఎకోటెక్ ప్రతి 5 ఏళ్ల డిసెంబర్‌లో 4 డిసెంబర్ సీజన్లో 40శాతం వరకూ లాభాలు పంచింది.స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో వృధ్ది సాధిస్తోన్న సంస్థగా వికాస్ ఎకోటెక్‌ని చెప్తారు
మహామాయా స్టీల్, స్టీల్ ఉత్పత్తులను వివిధ ఆకారాల్లో తయారు చేస్తోంది. ఇందుకోసం భారీ మెషినరీతో కూడిన స్ట్రక్చరల్ రోలింగ్ మిల్స్ సొంతంగా ఉండటం విశేషం. 600 ఎంఎం, 250 ఎం ఎం సైజుగల త్రికోణ స్టీల్ ఉత్పత్తులను తయారు చేయడంలం మహామాయ నంబర్ వన్ అని చెప్పుకోవచ్చు
ఐతే అన్ని డిసెంబర్‌లోలా  కాకుండా ఈ డిసెంబర్‌లో బేర్ పట్టు తెలుస్తోంది. అమెరికా వడ్డీరేట్లు, గుజరాత్ ఎన్నికల ప్రభాం వంటి అనేక అంశాలను మదుపరలు జాగ్రత్తగా గమిస్తున్నారు.అందుకే ఈ స్టాక్స్ ప్రతి డిసెంబర్‌లో పెరిగినంత మాత్రాన. అది గ్యారంటీ కాదు అని తెలుసుకోవాలిMost Popular