యుఫో మూవీజ్‌కు రేటింగ్‌ జోష్‌

యుఫో మూవీజ్‌కు రేటింగ్‌ జోష్‌

విదేశీ బ్రోకింగ్‌ సంస్థ సిటీగ్రూప్‌ బయ్‌ రేటింగ్‌ను కొనసాగించడంతో యుఫో మూవీజ్‌ కౌంటర్‌కు బలమొచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.5 శాతం పెరిగి రూ. 465 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 475 వరకూ జంప్‌చేసింది.
రూ. 610 టార్గెట్‌
యుఫో మూవీజ్‌కు గతంలో ఇచ్చిన బయ్‌ రేటింగ్‌ను మరోసారి ప్రస్తావిస్తూ తాజాగా టార్గెట్‌ ధరను రూ. 530 నుంచి రూ. 610కు పెంచుతున్నట్లు సిటీగ్రూప్‌ పేర్కొంది. ఇందుకు క్యూబ్‌తో విలీనంవల్ల కార్యకలాపాలు మరింత విస్తరించనుండటం, సినిమాలలో ప్రకటనల ఆదాయం పుంజుకోనుండటం వంటి అంశాలు దోహదపడనున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ అభిప్రాయపడింది. Most Popular