సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ!

సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ!

అమెరికా, ఆసియా మార్కెట్లు అటూఇటుగా ఉన్నప్పటికీ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్‌ నుంచీ పెరిగిన కొనుగోళ్లతో మరింత ఊపందుకున్నాయి. జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా అమెరికా గుర్తించడంతో పశ్చిమాసియాలో ఆందోళనలు నెలకొన్నప్పటికీ యూరప్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభంకావడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. 300 పాయింట్లు జంప్‌చేసి 32,897కు చేరింది. నిఫ్టీ సైతం 104 పాయింట్లు దూసుకెళ్లి 10,148ను తాకింది. 
బ్లూచిప్స్‌ తీరిదీ
నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, భారతీ, యూపీఎల్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, అరబిందో, ఇన్‌ఫ్రాటెల్‌, బాష్‌, బజాజ్‌ ఆటో 7-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కేవలం కోల్‌ ఇండియా, టీసీఎస్‌, విప్రో, సిప్లా మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1-0.25 శాతం మధ్య నీరసించాయి.Most Popular