గెయిల్‌కు పెట్టుబడుల జోష్‌!

గెయిల్‌కు పెట్టుబడుల జోష్‌!

వచ్చే ఆర్థిక సంవత్సరంలో విస్తరణపై పెట్టుబడులను భారీగా పెంచనున్నట్లు పేర్కొన్న గెయిల్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఈ ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసింది. రూ. 488 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 490 వరకూ ఎగసింది. 
55 శాతం అధికంగా
వచ్చే ఏడాదిలో రూ. 6,000 కోట్లను పైప్‌లైన్ల ఏర్పాటుకు వెచ్చించాలని భావిస్తున్నట్లు గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. ప్రస్తుత ఏడాది అదనపు పైపులైన్ల నిర్మాణానికి వెచ్చిస్తున్న రూ. 3800 కోట్లతో పోలిస్తే వచ్చే ఏడాది పెట్టుబడులు 55 శాతం అధికంకావడం గమనించదగ్గ అంశం. వీటికి అదనంగా 2020లో మరో 2,500 కిలోమీటర్లమేర పైప్‌లైన్లను నిర్మించనున్నట్లు గెయిల్‌ తెలియజేసింది. Most Popular