యూరప్‌ మార్కెట్లు సానుకూలమే!

యూరప్‌ మార్కెట్లు సానుకూలమే!

ట్రావెల్‌ అండ్‌ లీజర్‌ స్టాక్స్‌ జోరందుకోవడంతో యూరప్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం యూకే ఇండెక్స్‌ ఫుట్సీ, ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.2 శాతం చొప్పున పుంజుకోగా..  జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ 0.26 శాతం బలపడింది. క్రిస్మస్‌ నేపథ్యంలో సెలవుల సీజన్‌ ప్రారంభంకానుండటంతో ట్రావెల్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు.
జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా అమెరికా గుర్తించడంతో పశ్చిమాసియాలో ఆందోళనలు తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే బ్రెక్సిట్‌ కారణంగా యూరొపియన్‌ యూనియన్‌ను మరింత పటిష్ట పరచే ప్రణాళికలు తెరమీదకు రావడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. జీవీసీ హోల్డింగ్స్‌ 5 బిలియన్‌ డాలర్లకు లాడ్‌బ్రోక్స్‌ కోరల్‌ను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించడంతో విలీనాలు, కొనుగోళ్లు పుంజుకోనున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. లాడ్‌బ్రోకర్స్‌ 26 శాతం జంప్‌చేసింది.Most Popular