అమ్మకాల అమావాస్యలో 63 మూన్స్‌!

అమ్మకాల అమావాస్యలో 63 మూన్స్‌!

బాంబే హైకోర్ట్‌ ఆదేశాల నేపథ్యంలో ఇటీవల అమ్మకాల అమావాస్యను ఎదుర్కొంటున్న 63 మూన్‌ టెక్నాలజీస్‌(గతంలో ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌) షేరు మరోసారి పతనబాటలో సాగుతోంది. ఇన్వెస్టర్లు ఈ షేరుని వొదిలించుకునేందుకు ప్రయత్నించడంతో ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు దాదాపు 19 శాతం కుప్పకూలి రూ. 96 వద్ద ట్రేడవుతోంది.
నేషనల్‌ స్పాట్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈఎల్‌)తో  విలీన అంశాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ బాంబే హైకోర్ట్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. దీంతో గత నాలుగు రోజుల్లో ఈ కౌంటర్‌ 31 శాతం పతనమైంది. తాజాగా  బీఎస్‌ఈ సర్క్యూట్‌ ఫిల్టర్‌ను 5 శాతం నుంచి 20 శాతానికి పెంచడంతో ఈ కౌంటర్లో లావాదేవీలు జోరందుకున్నాయి. Most Popular