క్లారిస్‌ లైఫ్‌కు డీలిస్టింగ్‌ ఫీవర్‌!

క్లారిస్‌ లైఫ్‌కు డీలిస్టింగ్‌ ఫీవర్‌!

స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి షేర్లను డీలిస్ట్‌ చేసేందుకు కంపెనీ ప్రతిపాదించడంతో క్లారిస్‌ లైఫ్‌సైన్సెస్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 352 దిగువన ట్రేడవుతోంది. 
ఓపెన్‌ ఆఫర్‌..
క్లారిస్‌ లైఫ్‌ను డీలిస్టింగ్‌ చేసేందుకు ప్రమోటర్‌ సంస్థ అత్తనాస్‌ ఎంటర్‌ప్రైజస్‌ చేసిన ప్రతిపాదనను కంపెనీ బోర్డు అనుమతించింది. దీంతో పబ్లిక్‌ వద్ద ఉన్న 49.87 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ప్రమోటర్‌ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది. రివర్స్‌ బుక్‌బిల్డింగ్‌ పద్ధతిలో షేరుకి ఆఫర్‌ ధరను ప్రకటించనున్నట్లు క్లారిస్‌ లైఫ్‌ స్పష్టం చేసింది. కాగా.. సెప్టెంబర్‌ చివరికల్లా కంపెనీ వద్ద రూ. 2,077 కోట్ల నగదు నిల్వలుండటంతో ఒక్కో షేరు అంతర్గత విలువ కనీసం రూ. 381గా మార్కెట్‌ వర్గాలు మదింపు చేశాయి. కంపెనీలో ప్రమోటర్లకు 50.13 శాతం వాటా ఉంది.Most Popular