మార్కెట్లు లాభాల్లో - ఆటో స్పీడ్‌!

మార్కెట్లు లాభాల్లో - ఆటో స్పీడ్‌!

తొలి నుంచీ సానుకూలంగా కదులుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం పటిష్టంగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 254 పాయింట్లు ఎగసి 32,851ను తాకగా.. నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 10,128ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో రంగం దాదాపు 2 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో మెటల్‌, బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ రంగాలు 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి.
ఆటో కౌంటర్ల జోరు
ఆటో రంగ షేర్లలో బజాజ్‌ ఆటో, ఐషర్‌, బాష్‌, మారుతీ, అపోలో టైర్స్‌, మదర్‌సన్‌, అశోక్‌ లేలాండ్, టీవీఎస్‌, టాటా మోటార్స్‌, హీరోమటో, భారత్‌ ఫోర్జ్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి.
ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ విభాగంలో గెయిల్‌, టీవీ18 దాదాపు 7 శాతం దూసుకెళ్లగా.. కేన్‌ఫిన్‌, టెక్‌ మహీంద్రా, అదానీ పవర్‌, పెట్రోనెట్‌, అజంతా ఫార్మా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, మైండ్‌ ట్రీ, టాటా పవర్‌ 6-3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఐఆర్‌బీ, జూబిలెంట్‌ ఫుడ్‌, నిట్‌ టెక్, గోద్రెజ్‌ సీపీ, ఇన్ఫీబీమ్‌, గ్లెన్‌మార్క్‌, కావేరీ సీడ్‌, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా 3-1 శాతం మధ్య క్షీణించాయి. Most Popular