సెన్సెక్స్‌ జూమ్‌-  చిన్న షేర్లు సైతం!

సెన్సెక్స్‌ జూమ్‌-  చిన్న షేర్లు సైతం!

ప్రపంచ మార్కెట్ల నుంచి సరైన సంకేతాలు అందనప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు జోరుచూపుతున్నాయి. జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో ఆసియా మార్కెట్లలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. అయినప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తిని ప్రదర్శిస్తుండటంతో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. ప్రస్తుతం 240 పాయింట్లు పెరిగి 32,837కు చేరింది. నిఫ్టీ సైతం 80 పాయింట్లు ఎగసి 10,124 వద్ద ట్రేడవుతోంది.
లాభపడ్డవే అధికం
మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల కారణంగా బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,757 లాభపడితే.. 606 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో చమన్‌లాల్‌ 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా.. సోరిల్‌ ఇన్‌ప్రా, దావత్‌, గొదావరి పవర్‌, షాలిమార్‌, ట్రైజిన్‌, జీఎం బ్రూవరీస్‌, ఆర్కోటెక్‌, ఇండాగ్‌, జేబీఎఫ్‌, పుర్వంకారా, కోహినూర్‌ తదితరాలు 13-6 శాతం మధ్య దూసుకెళ్లాయి.Most Popular