రేటింగ్‌తో సోలార్‌ ఇండస్ట్రీస్‌ వెలుగు!

రేటింగ్‌తో సోలార్‌ ఇండస్ట్రీస్‌ వెలుగు!

బ్రోకింగ్‌ సంస్థ వెంచురా సెక్యూరిటీస్‌ తాజాగా కొనుగోలుకి సిఫారసు చేస్తూ రీసెర్చ్‌ నోట్‌ను ప్రకటించడంతో సోలార్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం ఎగసి రూ. 1174 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,210 వరకూ జంప్‌చేసింది. 
టార్గెట్‌ రూ. 1537
రెండేళ్ల కాలంలో సోలార్‌ ఇండస్ట్రీస్‌ షేరు రూ. 1,537 ధరను చేరగలదంటూ వెంచురా అంచనా వేసింది. టార్గట్‌ ధర బుధవారం ముగింపుతో పోలిస్తే దాదాపు 40 శాతం అధికంకాగా.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, మైనింగ్‌ రంగాల వృద్ధి కంపెనీ పురోగతికి దోహదం చేయగలవని అభిప్రాయపడింది. తక్కువ రుణ భారం, పటిష్ట క్యాష్‌ఫ్లో వంటి అంశాలు రానున్న కాలంలోనూ కంపెనీ పనితీరు మెరుగుపడేందుకు సహకరించగలవని పేర్కొంది.Most Popular