ఆసియా మార్కెట్లలో జపాన్‌ బౌన్స్‌బ్యాక్‌!

ఆసియా మార్కెట్లలో జపాన్‌ బౌన్స్‌బ్యాక్‌!

బుధవారం అమెరికా మార్కెట్ల క్షీణత, చమురు ధరల పతనం నేపథ్యంలో భారీగా పతనమైన జపాన్‌ మార్కెట్‌ కోలుకుంది. ట్రేడర్లు స్క్వేరప్‌ లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. అయితే మిగిలిన మార్కెట్లు అటూఇటుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జపనీస్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 1.5 శాతం జంప్‌చేయగా.. హాంకాంగ్‌ 0.5 శాతం, థాయ్‌లాండ్‌ 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే చైనా, తైవాన్‌, సింగపూర్‌, కొరియా, ఇండొనేసియా మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతుండటంతో 0.6-0.3 శాతం మధ్య క్షీణించాయి.
జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో పశ్చిమాసియాలో ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. దీనికితోడు చమురు ధరలు భారీగా పతనంకావడంతో అమ్మకాలకే మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular