సెంటమ్‌ ఎలక్ట్రానిక్స్‌కు నష్టాల దెబ్బ

సెంటమ్‌ ఎలక్ట్రానిక్స్‌కు నష్టాల దెబ్బ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించడంతో సెంటమ్‌ ఎలక్ట్రానిక్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 4 శాతం పతనమైంది. రూ. 625 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 580 వరకూ జారింది.
నిర్వహణ నష్టాలు
క్యూ2(జూలై-సెప్టెంబర్‌)లో సెంటమ్‌ రూ. 9 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ2లో రూ. 10 కోట్ల నికర లాభం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 14 శాతం తగ్గి రూ. 91 కోట్లను తాకింది. దాదాపు రూ. 7 కోట్లమేర నిర్వహణ నష్టం నమోదైంది.Most Popular