పోకర్ణకు క్యూ2 ఫలితాల షాక్‌

పోకర్ణకు క్యూ2 ఫలితాల షాక్‌

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో పోకర్ణ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు దాదాపు 8 శాతం పతనమైంది. 208 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 206 వరకూ జారింది.
లాభం డౌన్‌
క్యూ2(జూలై-సెప్టెంబర్‌)లో పోకర్ణ నికర లాభం 37 శాతం క్షీణించి రూ. 12 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం 9 శాతం తగ్గి రూ. 85 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 27 శాతం నీరసించి రూ. 27 కోట్లకు చేరింది.Most Popular