ఫోర్టిస్‌కు హర్యానా ఎఫ్‌ఐఆర్‌ దెబ్బ

ఫోర్టిస్‌కు హర్యానా ఎఫ్‌ఐఆర్‌ దెబ్బ

గుర్గావ్‌ హాస్పిటల్‌పై హర్యానా ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయమంటూ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వెలువడటంతో వరుసగా రెండో రోజు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ షేరు ప్రస్తుతం 2.5 శాతం క్షీణించి రూ. 141 వద్ద కదులుతోంది. బుధవారం సైతం ఈ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 145 దిగువన ముగిసిన సంగతి తెలిసిందే. Most Popular