మార్కెట్లకు ఆటో, మెటల్‌, బ్యాంక్స్‌ అండ!

మార్కెట్లకు ఆటో, మెటల్‌, బ్యాంక్స్‌ అండ!

ఇన్వెస్టర్లు అన్ని రంగాల స్టాక్స్‌లోనూ కొనుగోళ్లకు ప్రాధాన్యమివ్వడంతో మార్కెట్లు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 156 పాయింట్లు పురోగమించి 32,753ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ 52 పాయింట్లు ఎగసి 10,096కు చేరింది. ఆర్‌బీఐ యథాతథ పాలసీతో ముందురోజు పతనమైన మార్కెట్లలో స్క్వేరప్‌ లావాదేవీల కారణంగా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది.  
అన్ని రంగాలూ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ఆటో, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, ఫార్మా 1-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌ 4 శాతం జంప్‌చేయగా.. అరబిందో, టెక్‌ మహీంద్రా, బాష్‌, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, మారుతీ, యస్‌బ్యాంక్‌, యూపీఎల్‌, ఎల్‌అండ్‌టీ 2-1.4 శాతం మధ్య బలపడ్డాయి. మరోపక్క జీ, ఇండస్‌ఇండ్‌ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో అంటే 0.2 శాతం క్షీణించాయి.Most Popular