హాట్సన్‌ ఆగ్రోకు నిధుల దన్ను!

హాట్సన్‌ ఆగ్రోకు నిధుల దన్ను!

ప్రస్తుత వాటాదారులకు షేర్ల కేటాయింపు ద్వారా నిధులను సమీకరించేందుకు బోర్డు అనుమతించిన వార్తలతో హాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ కౌంటర్‌ బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2 శాతం పెరిగి రూ. 889 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 899 వరకూ జంప్‌చేసింది.
రూ. 900 కోట్లు
రైట్స్‌ ఇష్యూలో భాగంగా ప్రస్తుత వాటాదారులకు షేర్లను కేటాయించడం ద్వారా  రూ. 900 కోట్లను సమీకరించే ప్రతిపాదనకు బోర్డు అంగీకరించినట్లు హాట్సన్‌ ఆగ్రో ఎక్సేంజీలకు తాజాగా వెల్లడించింది.Most Popular