సీబీఐ కేసు- ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా డీలా 

సీబీఐ కేసు- ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా డీలా 

మౌలిక సదుపాయాల సంస్థ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చట్టవిరుద్ధంగా భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తూ సీబీఐ కేసు పెట్టిన వార్తలతో ఈ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం న్‌ఎస్‌ఈలో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా షేరు దాదాపు 6 శాతం పతనమై రూ. 198 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 197 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.
చార్జిషీట్‌ దాఖలు
నిబంధనలను అతిక్రమిస్తూ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా భూమిని కొనుగోలు చేసినట్లు పుణే సెషన్స్‌ కోర్టులో సీబీఐ చార్జిషీట్‌ నమోదు చేసినట్లు తెలుస్తోంది. పుణే-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను ఐఆర్‌బీ కొంతమంది వ్యక్తుల నుంచి అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తూ సీబీఐ కేసు దాఖలు చేసింది. కాగా.. 2015 జనవరిలోనే సీబీఐ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌కు చెందిన పుణే, ముంబై కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టడం ప్రస్తావించదగ్గ విషయం. Most Popular