లాభాలతో షురూ-అన్ని రంగాలూ ఓకే!

లాభాలతో షురూ-అన్ని రంగాలూ ఓకే!

ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 103 పాయింట్లు పెరిగి 32,700కు చేరగా.. నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకుని 10,74 వద్ద కదులుతోంది. బుధవారం ఆర్‌బీఐ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడిన నేపథ్యంలో మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. దీంతో ట్రేడర్లు స్వ్కేరప్‌ లావాదేవీలకు తెరతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
అన్ని రంగాలూ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ స్వల్పంగా నష్టపోగా.. మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. రియల్టీ, ఆటో, పీఎస్యూ బ్యాంక్స్‌, మెటల్‌ రంగాలు 0.8-0.3 శాతం మధ్య బలపడ్డాయి. బ్లూచిప్స్‌లో గెయిల్‌, బాష్‌, అరబిందో, టెక్‌ మహీంద్రా, భారతీ, బీపీసీఎల్‌, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, టాటా స్టీల్‌, హీరోమోటో 1.4-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే సన్‌ ఫార్మా, హిందాల్కో, అల్ట్రాటెక్, టీసీఎస్‌, కొటక్‌ బ్యాంక్‌ 1-0.2 శాతం మధ్య నీరసించాయి.Most Popular