టైర్ స్టాక్స్ ఇంకెంత పడవచ్చు..కారణాలు తెలుసుకోండి

టైర్ స్టాక్స్ ఇంకెంత పడవచ్చు..కారణాలు తెలుసుకోండి

స్టాక్‌మార్కెట్లలో రబ్బరు స్టాక్స్ గత వారం రోజులుగా నష్టాలు చవిచూస్తున్నాయ్. అంతర్జాతీయంగా రబ్బరు ధరలు పెరగడంతో పాటు, దేశీయంగా ఉత్పత్తి పడిపోవడమే ఇందుకు కారణం దేశీయంగా రబ్బరు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.  దీంతో ఈ రంగంలోని కంపెనీలు తమ మార్జిన్లపై ఈ పరిణామం ప్రభావం చూపిస్తుందని అందోళన బయలుదేరింది. అసలు  రబ్బర్ బోర్డు ఈ ఏడాది ప్రారంభంలో  8లక్షల టన్నుల నేచురల్ రబ్బర్  ఉత్పత్తి అవుతుందని అంచనా
వేసింది. ఇది గత ఏడాది కంటే 14శాతం ఎక్కువే. ఐతే, ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో ఉత్పత్తి అయిన రబ్బరు కేవలం 3లక్షల20వేల టన్నులు మాత్రమే. అంటే మిగిలిన 4లక్షల 80వేల టన్నులు ఈ చివరి ఆరునెలల్లో ఉత్పత్తి కావాలంటే భారీ ప్రయత్నాలు కావాలి. ఇది జరగని పని అని రబ్బర్ అసోసియేషన్ చెప్తోంది.

మాములుగా ఇప్పటిదాకా దేశంలో ఉత్పత్తి అయిన రబ్బరులో కేవలం 65-70శాతం మాత్రమే వినియోగం అవుతుండేది. ఐతే గత ఏడాది మాత్రం ఉత్పత్తి అయినదానికంటే 40శాతం అధికంగా వాడకం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధమైన డిమాండ్ ఉంది. ఐతే అకస్మాత్తుగా సహజమైన రబ్బరు ఉత్పత్తి పడిపోవడం ఆందోళన కలిగించకమానదు. ఎందుకంటే కంపెనీలు డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని చేసుకున్న ఒప్పందాలు అన్నీ రద్దవడం అటుంచి భవిష్యత్తులో వ్యాపారం చేయాలన్నా అదో మైనస్ పాయింట్‌గా మిగలొచ్చు. ఇక్కడే అంతర్జాతీయంగా రబ్బరుని దిగుమతి చేసుకోవచ్చు కదా అనే ప్రశ్న రావచ్చు. కానీ ఇతర దేశాలనుంచి ఇంపోర్ట్ చేసుకునే రబ్బరుపై 25శాతం ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత గరిష్ట పన్నుగా ఆటోమోటివ్ టైర్ మేన్యుపేక్చరర్స్ అసోసియేషన్ చెప్తోంది.ఇంత డిమాండ్ సప్లై గ్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంపెనీలు కొనే రబ్బరు రేటు పెరుగుతుంది.అలానే ఆ పెరిగిన ధరని చివరికి కస్టమర్‌పైనే వేయాల్సి వస్తుందంటారు. అంత రేటు పెట్టలేరు కాబట్టి..సంస్థల కాస్త మార్జిన్లు తగ్గించి అమ్ముకోవాలి. అంటే చివరికి అటు కస్టమర్,ఇటు సంస్థ రెండూ రబ్బరు వలన నష్టపోకతప్పదు..అదే స్టాక్ మార్కెట్‌లోనూ ప్రతిఫలిస్తుంది.ఇలాంటి పరిస్థితుల్లో  ట్రక్కులకు వాడే రేడియల్ టైర్లను క్వాలిటీతో తయారు చేయడం మరో సమస్యగా జేకే టైర్స్ యాజమాన్యం చెప్తోంది

అక్టోబర్‌లో నేచురల్ రబ్బర్ అంతర్జాతీయ ధర కేజీకి దాదాపు రూ.109 ఉండగా, అది దిగుమతి సుంకంతో కలిపి రూ.150 అవుతుంది..అదే దేశీయంగా అమ్ముడయ్యే  నేచురల్ రబ్బర్ మాత్రం రూ.130నుంచి రూ.139 మాత్రమే. ధరల్లో ఇంత తేడా ఉంది కాబట్టే ఇప్పుడు నేచురల్ రబ్బర్ ఉత్పత్తి పడిపోవడం టైర్ మేకింగ్ స్టాక్స్‌లో పతనాలకు దారితీస్తోంది. గత ఐదురోజుల్లో అపోలో టైర్స్ రూ.255 నుంచి రూ.236 స్థాయికి పతనం అయింది. జేకే టైర్స్ కూడా రూ.145 నుంచి రూ.136 స్థాయికి నష్టపోయింది. సియట్ రూ.1812 నుంచి రూ.1694వరకూ పతనం కాగా..మార్కెట్ బాహుబలి ఎమ్మాఆర్ఎఫ్ కూడా రూ.69వేల నుంచి రూ.65886కి దిగింది. ఈ పతనాలు ఇంకా కొనసాగవచ్చనే అంచనాలు మార్కెట్లో ఉన్నాయ్. 

కింది ఫోటోలో టైర్ల రంగంలోని స్టాక్స్ బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఎలా ముగిసాయో చూడొచ్చుMost Popular