ఆర్‌బిఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే లాభాలు పంచే స్టాక్స్ ఇవే!

ఆర్‌బిఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే లాభాలు పంచే స్టాక్స్ ఇవే!

రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా త్రైమాసిక పరపతి విధాన సమీక్షా సమావేశం కొద్ది సేపట్లో ముగిసి, వడ్డీ రేట్లపై నిర్ణయం ప్రకటించనుంది.గతంలో యధాతథంగానే ఉంచినా..దాదాపుగా పాతవడ్డీ రేట్లనే కొనసాగించవచ్చనే అభిప్రాయాలు ఉన్నా..ఈసారైనా వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని కొంతమంది ఊహిస్తున్నారు.అలా తగ్గిస్తే బాగా లాభపడే స్టాక్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మారుతిసుజికి, అశోక్ లేలాండ్, డిహెచ్ఎఫ్ఎల్, టివిఎస్ మోటర్, ఎల్ అండ్ టి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నాయ్ 
రిటైల్ ఇన్‌ఫ్లేషన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్‌ఫ్లేషన్ దాదాపు ఏడునెలల స్థాయికి చేరింది. ఇది 3.58శాతంగా అక్టోబర్‌లో నమోదు కాగా..సెప్టెంబర్‌ నెలలో 3.28శాతంగా ఉంది.క్రూడాయిల్ ధరలు పెరగడం కూడా ఈ స్థితికి కారణంగా చెప్తున్నారు. ఈ నేపధ్యంలో ద్రవ్యోల్బణం ప్రాతిపదికగా ప్రస్తుతం వడ్డీ రేట్ల తగ్గింపు అనేది సాధ్యపడకపోవచ్చని అంటున్నారు. ఐతే అమెరికా ఆర్ధిక స్థితి మెరుగుపడటం, అక్కడి సెంటిమెంట్ బావుండటం వంటి అంశాలతో అక్కడి వడ్డీరేట్లు పెంచే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయ్. కాబట్టి అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లపై తీసుకునే నిర్ణయాన్ని బట్టే..ఆర్‌బిఐ కూడా తన నిర్ణయాన్ని అప్పుడే ప్రకటించే అవకాశం కన్పిస్తోంది తప్ప ఇప్పట్లో వెంటనే వడ్డీరేట్లని తగ్గించబోదని కొందరి అభిప్రాయం.ద్రవ్యలోటు పెరగడం, క్రూడాయిల్ ధరలు గరిష్టంగా ట్రేడవడం వంటి ఇతర అంశాలను గమనించినప్పుడు ఆ వాదనకి బలం చేకూరుతోంది. ఐతే అనూహ్యమైన నిర్ణయం ఏదైనా తీసుకుంటే మాత్రం ఆ పరిణామం డిహెచ్ఎఫ్ఎల్ వంటి స్టాక్స్‌కి బాగా లాభిస్తుందని కేఐఎఫ్ఎస్ ట్రేడ్ కేపిటల్ అనలిస్ట్ చిరాగ్ సింఘ్వీ చెప్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫిన్‌సర్వ్ తర్వాత ఆ స్థాయిలో లోన్ బుక్ ఆర్డర్లు ఉన్న ఈ సంస్థతో పాటు..ఎక్కువ మొత్తంలో అప్పులున్న సంస్థలు కూడా బాగా లాభపడతాయని ఆయన అభిప్రాయం. మంగలం సిమెంట్, ఎన్‌సిసి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా ఈకోవకి చెందినవే..! 

Analyst: Sanjeev Jain, Associate Vice-President of Ashika Stock Broking
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మంచి లోన్ బుక్ ఆర్డర్ ఉన్న ఎస్‌బిఐ  గత కొన్ని క్వార్టర్లుగా తన పనితీరుని సమర్ధవంతంగా మెరుగుపరిచింది. బల్క్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచిన ఎస్‌బిఐ ఇప్పుడు కనుక వడ్డీరేట్లు తగ్గి స్తే భారీగా లాభపడనుందని అంచనా

పంజాబ్ నేషనల్ బ్యాంక్
అసెట్ క్వాలిటీలో ఇంప్రూవ్‌మెంట్ కనబరిచిన పిఎన్‌బి, గ్రాస్ ఎన్‌పిఏ, నెట్ ఎన్‌పిఏల విషయంలోనూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్‌లో 35బిపిఎస్, 23 బిపిఎస్‌గా నమోదు చేశాయ్. ప్రభుత్వం ఇన్ఫ్రా, ఐరన్ అండ్ స్టీల్ వంటి సెక్టార్లపై ఫోకస్ పెట్టడం పిఎన్‌బికి కలిసి వస్తుందని అంచనా
మారుతి సుజికి
నవంబర్ లో 1.54లక్షల యూనిట్ల విక్రయాలు సాధించిన సంస్థ, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌గా చూసినప్పుడు 14.1శాతెం వృధ్ది నమోదు చేసింది. దేశీయంగానే ఈ రేంజ్ అమ్మకాలు సాధించడం విశేషం. వడ్డీరేట్లు తగ్గిస్తే ఆ ప్రయోజనాలు కస్టమర్లకి..సంస్థకి బాగా లాభిస్తుందని అనలిస్టుల అంచనా

Analyst: Mustafa Nadeem, CEO, Epic Research
టివిఎస్ మోటర్
వడ్డీ రేట్ల తగ్గింపు టివిఎస్ మోటర్ సంస్థ తన విస్తరణకోసం నిధులు ఖర్చుపెట్టడానికి ఉపయోగపడుతుందని అంచనా. అలానే స్టాక్ మొమెంటమ్‌కి సాయపడుతుంది. ఇప్పటికే అనేకసార్లు మంచి అప్ ‌మూమెంట్ కనబరిచిన టివిఎస్ మోటర్, భవిష్యత్తులోనూ అదే జోరు కొనసాగించి రూ.780-790కి ఎగసే అవకాశం ఉందని ఎపిక్ రీసెర్చ్ చెప్తోంది
ఇండస్ఇండ్ బ్యాంక్
ప్రవేట్ సెక్టార్ బ్యాంకుల్లో టాప్ మోస్ట్ పెర్ఫామర్‌గా ఇండస్ఇండ్ లిక్విడిటీ పరంగా రికార్డు క్రియేట్ చేసింది. స్టాక్ కూడా అదే విధమైన వృధ్ది నమోదు చేస్తోంది. వడ్డీ రేట్లని ఆర్‌బిఐ తగ్గిస్తే, స్టాక్ రూ.1850-1900 వరకూ వెళ్లే ఛాన్సుందని ముస్తాఫా నదీమ్ చెప్తున్నారు
ఎల్ అండ్ టి
షార్ట్ టర్మ్ కరెక్షన్ సైకిల్‌లో ఉన్న ఈ స్టాక్ వడ్డీరేట్లు కనుక తగ్గితే అప్‌ట్రెండ్‌ పడుతుందని ఎపిక్ రీసెర్చ్  లెక్క కడుతోంది. ఈపిసి, ఇన్ఫ్రా స్పేస్‌లో ఆధిపత్యం వహిస్తోన్న ఈ కంపెనీకి వడ్డీ రేట్ల తగ్గింపు తన నిధుల వ్యయానికి ఉపయోగపడుతుంది. అదే జరిగితే రూ. 1330-1340వరకూ వెళ్లే అవకాశముందట

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
ప్రవేట్  బ్యాంకింగ్ స్పేస్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తిరుగులేని హీరో. మిగిలిన స్టాక్స్ కరెక్షన్‌కి గురవుతున్నా..ఇది మాత్రం అప్‌వార్డ్ మూమెంట్ కొనసాగిస్తూనే ఉంది. ఓ వేళ ఆర్‌బిఐయధాతథ స్థితి కొనసాగించినా..ఈ షేరు ధర రూ.1950-2000వరకూ చేరుతుందని అంచనా

Analyst: Pushkaraj Sham Kanitkar, AVP - Technical Research at GEPL Capital

హెచ్‌డిఎఫ్‌సి
ప్రవేట్ సెక్టార్ లెండర్లలో ఈ కంపెనీకి వడ్డీ రేట్ల తగ్గింపు రిటన్ ఆన్ అసెట్‌ పరంగా లాభించనుంది. 

అశోక్ లేలాండ్
గత కొన్ని త్రైమాసికాలుగా మంచి ఫలితాలు ప్రకటిస్తోంది అశోక్ లేలాండ్. వడ్డీ రేట్ల తగ్గింపు ఈ సంస్థ ఇచ్చే రుణాలు చౌకగా లభించేందుకు సాయపడతాయ్.అలానే సంస్థ ఉత్పత్తులు త్వరగా అమ్ముడయ్యేందుకు తక్కువ వడ్డీరేట్లు సాయపడతాయ్. 

డిహెచ్ఎఫ్ఎల్
ముందే చెప్పుకున్నట్లు లోన్ బుక్ వేల్యూ పెరగడానికి ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉపయోగపడనుంది. హౌసింగ్ పైనాన్స్ రంగంలో వ్యాపారం పెరిగేందుకు కూడా వడ్డీరేట్లు కీలకం. నెట్ ఇంట్రస్ట్ మార్జిన్స్ ( నికర వడ్డీ ఆదాయం) ఇప్పటికే మంచి వృద్ది సాధిస్తుండగా..ఆర్‌బిఐ ఏ మాత్రం వడ్డీరేట్లు తగ్గించినా..ఇఁకా మెరుగుపడటం ఖాయం

( పైన చెప్పిన అభిప్రాయాలు ఆయా అనలిస్టులు వ్యక్తిగతం. వాటికీ ప్రాఫిట్. యువర్ ట్రేడ్.ఇన్ సైట్‌కి సంబంధం లేదు..లావాదేవీలకు బాధ్యత వహించజాలదు)Most Popular