8న ముగియనున్న సప్లై చైన్‌ ఐపీవో!

8న ముగియనున్న సప్లై చైన్‌ ఐపీవో!

కిశోర్‌ బియానీ ఫ్యూచర్‌ గ్రూప్‌ నుంచి మరో కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. లాజిస్టిక్స్‌ రంగంలో కార్యకలాపాలు కలిగిన ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. ఇష్యూ నేడు(6న) ప్రారంభమై శుక్రవారం(8న) ముగియనుంది. ఇష్యూకి రూ. 660-664 ధరల శ్రేణికాగా.. తద్వారా కంపెనీ రూ. 650 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఆఫర్‌లో భాగంగా దాదాపు 95 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. 
యాంకర్‌ నిధులు
ఐపీవోలో భాగంగా ఫ్యూచర్‌ సప్లై చైన్‌ మంగళవారం 16 యాంకర్‌ ఇన్వెస్టర్‌ సంస్థల నుంచి రూ. 195 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 664 ధరలో 2.93 మిలియన్‌ షేర్లను విక్రయించింది.  కాగా.. ఇష్యూకి కనీస లాట్‌ 22 షేర్లుకాగా.. రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ. 2 లక్షల మొత్తం మించకుండా దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. కంపెనీ ఐటీ ఆధారిత వేర్‌హౌసింగ్‌, పంపిణీ, తదితర లాజిస్టక్‌ సేవలను అందిస్తోంది. ఈ రంగంలో ఇటీవలే మహీంద్రా గ్రూప్‌ సంస్థ మహీంద్రా లాజిస్టిక్స్‌ స్టాక్‌ ఎక్సేంజీలలో లిస్టయ్యింది. కాగా.. ఐపీవోలో కంపెనీ ఆశిస్తున్న ధర అధికంగా ఉన్నట్లు పలు బ్రోకింగ్‌ సంస్థలు అభిప్రాయపడ్డాయి. Most Popular