ధర ఎక్కువ..లాభాలూ ఎక్కువే!

ధర ఎక్కువ..లాభాలూ ఎక్కువే!

స్టాక్‌మార్కెట్‌లో ఈ కంపెనీల షేర్ల ధరలు చూస్తే  చిన్నపాటి ఇన్వెస్టర్లు అంత త్వరగా కొనేందుకు మొగ్గు చూపరు. ఎందుకంటే కనీసం వాటి రేటు ఐదారు వేలు పైనే ఉంటుంది.దీంతో అంత రేటు పెట్టి పదిషేర్లు కొనేబదులు ఓ వందరూపాయలవో, రూ.200వో రెండు మూడు వందల షేర్లు కొనుక్కోవచ్చు కదా అనుకుంటారు. ఐతే పర్సంటేజీ పరంగా చూసినప్పుడు ఇవి ఇచ్చే లాభాలు చూస్తే వావ్ అన్పించకమానదు. అలానే ఇంత పెరిగాక ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉండదులే అనే అపనమ్మకం కూడా ఆయా స్టాక్స్‌ జోలికి వెళ్లకపోవడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు
ఐతే అలా భారీ రేటు ఉన్న స్టాక్స్ ‌కొన్ని  ఏ రేంజ్ లాభాలు ఇచ్చాయో ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఇన్ సైట్ రీసెర్చ్ చేసి వ్యూయర్స్ కోసం రీసెర్చ్ చేసి ఓ టేబుల్ రూపంలో కింద పొందుపరిచింది.  ఇందుకోసం రూ.5వేల రూపాయలపైన ఉన్న రేటు గల షేర్లు, మార్కెట్ కేపిటలైజేషన్ రూ.5వేలకోట్ల పైన ఉన్న కంపెనీలు అనే రెండు ఫిల్టర్స్‌ని వాడటం జరిగింది. అలా బిఎస్ఈ నుంచి 11 స్టాక్స్ ఎంపిక చేసి పట్టికరూపంలో ఇచ్చాం.వాటిని చూస్తే పిండి కొద్దీ రొట్టె అనే సామెత గుర్తుకు రాక మానదు. ఓ ఐదు కంపెనీల షేర్లు అయితే ఇన్వెస్టర్ల సంపద రెట్టింపు చేసాయ్. ఇక నష్టాల సంగతికి వస్తే ఒక్క బ్లూడార్ట్ మాత్రం గత మూడేళ్లుగా నెగటివ్ రిటర్న్స్ ఇచ్చింది

మూడేళ్ల పెర్ఫామెన్స్‌ని కింద ఫోటోలో చూడొచ్చు

ఇక ఎర్నింగ్స్ పర్ షేర్ అంశానికి వస్తే హనీవెల్ ఆటో, 3ఎంఇండియా,పేజ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటర్స్ గత మూడు ఆర్ధిక సంవత్సరాల్లో చక్కని పనితీరు కనబరిచాయ్. ప్రోక్టర్ అండ్ గేంబుల్ హైజీన్ , బాష్ ఈపిఎస్ మంచి వృధ్ది నమోదు చేశాయ్. లాభాల విషయానికి వస్తే షేరుకి పి అండ్ జి 68శాతం, బాష్ 7శాతం పంచాయ్(అది కూడా బ్యాడ్ టైమ్ నడుస్తోన్న సమయంలో)

ఇక ప్రస్తుత మార్కెట్లలో రూ.5వేల ధరపైన ఉండి మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 5వేలకోట్లు దాటినవి స్టాక్స్ 20వరకూ ఉండగా,వాటిలో 14 కంపెనీల ఎర్నింగ్స్ పర్ షేర్ వృధ్ది గత మూడు ఆర్ధిక సంవత్సరాలుగా అమోఘంగా పెరుగుతూ లాభాలు పంచుతున్నాయ్. అవి హనీవెల్ ఆటో, పేజ్ ఇండస్ట్రీస్, టిటికె ప్రెస్టీజ్, 3ఎం ఇండియా, బాష్, ఐషర్ మోటర్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మారుతి సుజికి, వాబ్కో  ఇండియా, ఐఎస్‌జిఈసి హెవీ, పి&జి  హైజీన్, గిలెట్ ఇండియా, అబాట్ ఇండియా కంపెనీలు..సో ఎంత చెట్టుకుి అంత గాలిలా ఎంత రేటు పెడితే అంత లాభాలు పంచే అవకాశమూ ఉందన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి.Most Popular