ఎవరూ పట్టించుకోని ఈ స్టాక్సే మంచి లాభాలు ఇస్తున్నాయట

ఎవరూ పట్టించుకోని ఈ స్టాక్సే మంచి లాభాలు ఇస్తున్నాయట

ఇప్పుడు బాగానే ఉంది..ఇకపైనా బానే ఉంటుంది..ఇదీ స్టాక్ మార్కెట్లపై ప్రధాన రీసెర్చ్ ఏజెన్సీల మాట. మధ్యలో మధ్యలో చిన్నపాటి కరెక్షన్లే తప్ప పెద్దగా పతనమయ్యే అవకాశాలు తక్కువని వారి ఉవాచ. ఐతే ఇలాంటి బుల్ మార్కెట్‌లో కొన్ని స్టాక్స్‌ని కొంతమంది అసలు పట్టించుకోలేదు..కానీ అవి మాత్రం సైలెంట్‌గా లాభాలు పంచుతున్నాయ్. పట్టించుకోలేదు అంటే..అవి ఎప్పుడూ స్క్రీన్ ఎక్కింది లేదు..రోజుకి 10శాతం పెరిగింది..6శాతం ర్యాలీ చేసింది ఇలాంటి కామెంట్లతో ఈ స్టాక్స్‌ హెడ్‌లైన్స్‌లో నిలవకపోవడంతో వాటిపై దృష్టి పెట్టే అవకాశమే ఉండదు..ఆ స్టాక్స్ ఏవో చూద్దాం
జిఎస్‌టి ప్రభావిత స్టాక్స్, డిమాండ్ ఉన్నా పెద్దగా పెరగని స్టాక్స్ లాంగ్‌టర్మ్‌లో సేఫ్ ‌బెట్స్‌గా కొంతమంది చెప్తున్నారు. కేపిటల్ పెంచుకుంటున్నవి గ్లోబల్ అంశాలు మద్దతు సమకూర్చుతున్నవి, విస్తరణకోసం ఖర్చు పెడుతున్నవి అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ఓ 15 స్టాక్స్‌ని ఏరి కూర్చింది ఇవి దాదాపు 38శాతం వరకూ ఇప్పటికే లాభాలు పంచడం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా 1శాతం కంటే తక్కువ బీటా స్టాక్స్‌గా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సూచించింది


పైన చూపించిన 15 స్టాక్స్‌లో 7 కంపెనీలపై జిఐబి ఓవర్‌వెయిట్ ఉన్నట్లుగా సూచిస్తోంది. వాటిలో కాఫీడే ఎంటప్రైజెస్ 38శాతం వరకూ పెరగగా(2017 కేలండర్ ఇయర్) ఏషియన్ పెయింట్స్ 26శాతం, శ్రీ సిమెంట్స్ 15శాతం పెరిగాయి. నెస్లే ఇండియా, విప్రో, మారికో, కోల్గేట్ పామోలివ్, మైండ్‌ట్రీ , గ్లాక్సో ఫార్మా,  ఐడిఎఫ్‌సి బ్యాంక్ ఇప్పటిదా ఈ ఏడాదిలో నష్టాలను చవి చూశాయ్. 
" వీటిలో చాలా స్టాక్స్ అండర్‌వెయిట్‌వి కావచ్చు..అలానే కొనడానికి పెద్దగా ఆకర్షణీయంగా కన్పించకపోవచ్చు. కానీ వాటిలో పొటెన్షియల్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. పతంజలి నుంచి బాగా పోటీ ఎదుర్కొంటోన్న కాల్గేట్ అండ్ పామోలివ్ స్టాక్ నిజంగా ఈ రంగంలో లీడర్. ప్రస్తుతానికి పోటీ ఎదుర్కొంటున్నా, ఈ స్టాక్ లాంగ్‌టర్మ్‌లో ఇంతవరకూ లాభాలనే పంచింది" అని కేఐఎఫ్ఎస్ కేపిటల్ ఫండమెంటల్ రీసెర్చ్ అనలిస్ట్ చిరాగ్ సింఘ్వీ చెప్తారు
" అలానే నెస్లే కూడా అండర్‌వెయిట్ స్టాక్‌గా చూస్తున్నారు. సేల్స్ , లాభాలు తగ్గడమే కారణం. డాబర్ కూడా ఎఫ్ఎంసిజి రంగంలో మంచి బెట్ అవుతుంది. " అంటారు సింఘ్వీ
ఇక ఏషియన్ పెయింట్స్, కాఫీడే, హాథ్‌వే కేబుల్, శ్రీ సిమెంట్స్ ఇంకా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని ఆయన చెప్తారు. కమిన్స్ ఇండియా మంచి డివిడెండ్ ఇస్తుందని..ఫండమెంటల్స్ కూడా
గొప్పగా ఉన్నాయంటారాయన
కింద టేబుల్‌లో ఏ స్టాక్‌కి ఎలాంటి రేటింగ్ ఇచ్చారో చూడొచ్చు


( పైన చెప్పినటువంటి స్టాక్స్‌ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఇన్ సైట్ రికమండేషన్స్‌గా చూడరాదు. ఆయా సంస్థల అనలిస్టుల సూచనలు మాత్రమే. లాభ నష్టాలకు బాధ్యత వహించజాలదు)


 Most Popular