షాల్బీ హాస్సిటల్‌కు యాంకర్‌ నిధులు!

షాల్బీ హాస్సిటల్‌కు యాంకర్‌ నిధులు!

అహ్మదాబాద్‌ కేంద్రంగా 1994 నుంచీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న షాల్బీ హాస్సిటల్‌ పబ్లిక్‌ ఇష్యూ నేటి (5) నుంచీ మొదలుకానుంది. 7న(గురువారం) ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ. 505 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా సోమవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 150 కోట్లను సమీకరించింది. యాంకర్‌ ఇన్వెస్టర్లలో గోల్డ్‌మన్‌ శాక్స్‌, సిటీగ్రూప్‌, యాక్సిస్‌ ఎంఎఫ్‌ తదితర సంస్థలున్నాయి. ఇష్యూకి కంపెనీ ఇప్పటికే రూ. 245-248 ధరల శ్రేణిని ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా సంస్థ రూ. 480 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రమోటర్‌ విక్రమ్ షా రూ. 25 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.  
60 షేర్లు ఒక లాట్‌
రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 60 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా షేర్లు కావాలనుకుంటే రూ. 2 లక్షల మొత్తానికి మించకుండా ఒకే లాట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీవో నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్‌ కార్యకలాపాలకు వెచ్చించనున్నట్లు షాల్బీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. సంస్థకు రూ. 320 కోట్లమేర రుణభారముంది.Most Popular