మారుతి షేరు రూ.10వేల మార్క్ చేరుకోగలదా

మారుతి షేరు  రూ.10వేల మార్క్ చేరుకోగలదా

ఆటోస్టాక్స్ మంచి ర్యాలీ నడిపిస్తోన్న తరుణంలో గ్లోబల్ ఆటో కంపెనీలపై తాజాగా ఓ నివేదిక విడుదల కాగా అందులో మారుతి సుజికి స్టాక్ రూ.9843 వరకూ పెరుగుతుందని ఔట్‌లుక్ ఉంది. దేశీయ వాహనతయారీ రంగంలో అగ్రగామి అయిన మారుతి ఈ కేలండర్ ఇయర్‌లో ఇప్పటికే 60శాతం పెరిగి ఉండగా..మరో 25శాతం పెరిగే సత్తా ఉందా అంటే..ఔననే అంటున్నాయి రీసెర్చ్ కంపెనీలు కూడా! దీంతో ఈ షేరు పదివేలు చేరుతుందా..ఇంకా పెరుగుతుందా అనే ఆసక్తికర ప్రశ్నలు బైల్దేరాయ్

మారుతి సుజికి ఇప్పటికే 52వీక్స్ హై మార్క్ అయిన 9119.95ని(డిసెంబర్ 8న) తాకింది( స్టోరీ రాసిన డిసెంబర్ 4న రూ.8695ని తాకింది.) అయితే, రానున్న ఏడాదికాలంలో మారుతి సుజికి స్టాక్ ప్రైస్ ఖచ్చితంగా ఐదంకెల సంఖ్యకి చేరుతుందని నోమురా రీసెర్చ్ ఏజెన్సీ చెప్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆటోస్టాక్స్‌పై నోమురా రీసెర్చ్ ఏజెన్సీ ఓ స్టడీ చేయగా..వాటిలో మన మారుతి సుజికి రూ.9843ని అందుకోగల సామర్ధ్యం ఉందని తేల్చింది. చైనా కంపెనీ -బివైడి, యూఎస్-టెస్లా, టయోటాలు భవిష్యత్తులో ఔట్‌పెర్ఫామ్ చేయగల సత్తా ఉన్నట్లు నోమురా ఏజెన్సీ రిపోర్ట్ చెప్తోంది. 
" కొత్త మోడళ్ల డిమాండ్, మార్కెట్ ట్రెండ్‌నుంచి హెచ్చు ధరలలాభం, క్యాష్ ఫ్లో జనరేషన్ ఈ మూడు అంశాల ఆధారంగా మారుతి సుజికిని ఎంపికచేశాం" అని కపిల్ సింగ్ అనే నోమురా అనలిస్ట్ చెప్పారు. రానున్న 5-10 ఏళ్లపాటు ఇండియన్ పాసింజర్ మార్కెట్ 12-14శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్‌రేటు నమోదు చేస్తుందని నోమురా సంస్థ తెలిపింది. ఇదే కాలంలో టూవీలర్ మార్కెట్ సెగ్మెంట్‌లో కూడా 10శాతం సిఏజిఆర్ నమోదు అవుతుందని అంచనా. ఇందులోనూ స్టూటర్ వెహికల్స్ వృధ్ది 15-20శాతం పెరుగుతుండగా..అది కూడా గ్రామీణప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుందని సంస్థ అంచనా వేస్తోంది.  ఈ ఏడాది చివరినాటికి ప్రతి వెయ్యిమందిలో 28మందికి సొంతవాహనాలు ఉంటాయని ఆ దిశలో అమ్మకాలు ఉంటాయని నోమురా సంస్థ రిపోర్ట్ చెప్తోంది. ఈ స్థాయి కొనుగోళ్లు చైనా, సౌత్ కొరియాలో ఉన్నాయని భారత్ కూడా త్వరలోనే వాటి సరసన చేరుతుందని చెప్తున్నారు.  ఈ మధ్యనే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నట్లు మారుతి సుజికి ప్రకటించింది. టయోటా భాగస్వామ్యంతో ఈ రంగంలోకి రానున్న మారుతి గాసోలైన్, డీజిల్ కార్లను ఇప్పటికే మారుతి నడుపుతోంది. 
"గత కొన్నేళ్లుగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మార్కెట్‌ షేర్ దక్కించుకుంటోన్న మారుతి, మారకపు విలువల్లో తేడాలను, మార్పులను కూడా
సమర్ధవంతంగా అధిగమించింది. అందుకే భవిష్యత్తులో సునాయాసంగా మారుతి సుజికి సంస్థ షేరు రూ.10వేల మార్కుని అధిగమిస్తుందని చెప్పగలం
" అని
ఈక్వినామిక్స్ రీసెర్చ్ ఏజెన్సీ సంస్థ ఎండి జి.చొక్కలింగం చెప్తున్నారు. ఈ అంచనాలకు తోడుగా మరికొంతమంది అనలిస్టులు కూడా షేరు ధర 10K అవుతుందని ఘంటాపథంగా చెప్తున్నారు..ఐతే ఎవరేం చెప్పినా స్టాప్‌లాస్ ఖచ్చితంగా మెయిన్‌టైన్ చేసి లాంగ్ టర్మ్ ఉండగలిగితేనే లాభాలు దక్కుతాయనడంలో సందేహం లేదు(
మారుతి సుజికి షేరు ఈ కథనం ప్రచురించిన డిసెంబర్ 4న 1.07శాతం నష్టపోయి రూ.8512.40వద్ద ముగిసింది. డిసెంబర్ 8న రూ.9119.95 గరిష్టస్థాయిని తాకిన 9040.85 వద్ద ముగిసింది)Most Popular