స్మాల్‌క్యాప్‌లో స్టార్స్‌ పిక్ చేయడంలో ఇతగాడు టాప్..మరి ఈ స్టాక్స్ మీ దగ్గరున్నాయా?

స్మాల్‌క్యాప్‌లో స్టార్స్‌ పిక్ చేయడంలో ఇతగాడు టాప్..మరి ఈ స్టాక్స్ మీ దగ్గరున్నాయా?

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనే కాన్సెప్ట్‌తో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు ఉత్సాహపడుతుంటారు. ఐతే తీరా పెట్టుబడి పెట్టేసరికి అవి పెద్దగా పెర్ఫామ్ చేయకపోగా..నష్టాల పాలవుతుంటారు కూడా! ఐతే అనిల్‌కుమార్ గోయెల్ అనే ఓల్ట్‌మేన్ మాత్రం గోల్డ్‌లాంటి స్టాక్స్ పిక్ చేస్తుంటారు. ఆయన పోర్ట్‌ఫోలియోలో 34 బిఎస్ఈ స్మాల్‌క్యాప్ కంపెనీలు ఉండగా..వాటిలో 12 కంపెనీలు మల్టీ బ్యాగర్లు కావడం విశేషం. అంటే మూడింట ఓ వంతు బీభత్సమైన లాభాల వచ్చినట్లే లెక్క! 
అనిల్ కుమార్ గోయెల్ ఇప్పటి బుల్‌రన్‌ని మూడేళ్ల క్రితమే ఊహించారు. 2014లోనే మదర్ ఆఫ్ ఆల్ బుల్‌రన్ ప్రారంభమైందని ఎక్స్‌పెక్ట్ చేసిన గోయల్ స్టాక్స్‌లో 19 కంపెనీల స్టాక్స్ బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌ పెర్ఫామెన్స్‌ని మించి మరీ పెరిగాయి. ఆయన స్టాక్స్‌లో పనామా పెట్రోలో పెట్టుబడి గత ఏడేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఈ కంపెనీ షేరు ఈ ఏడాదిలో 254శాతం పెరగడం విశేషం. మరో స్టాక్ ఐజీ పెట్రోకెమికల్స్ 212శాతం లాభాలు పంచింది. షుగర్ కంపెనీ ఉత్తమ్ షుగర్ మిల్స్‌లో అనిల్ కుమార్ గోయెల్ వాటా 5.38శాతం వాటా కలిగి ఉండగా, ఈ స్టాక్ 211శాతం పెరిగింది(2017లో). ఈ స్టాక్‌లో గోయెల్ పెట్టుబడి పెట్టింది ఈ ఏడాది మార్చిలోనే కావడం గమనార్హం. 
చాలామంది ఇన్వెస్టర్లు ఫ్యాన్సీ కౌంటర్లలోనే తమ పెట్టుబడి పెడుతుండగా గోయెల్ మాత్రం పెద్దగా మొమెంటమ్ చూపని స్టాక్స్‌ని ఎంచుకుంటానని చెప్తుంటారు. ఆయన పోర్ట్‌ఫోలియోనే గమనిస్తే, వర్ధమాన్ స్పెషల్ స్టీల్(168శాతం), ఇండ్‌సిల్ హైడ్రో(162శాతం), తిరుమలై కెమికల్స్(154.39శాతం) జేబిఎం ఆటో(133శాతం), ధంపూర్ షుగర్(137శాతం), పంజాబ్ ఆల్కలీస్(114శాతం) లాభాలు పంచిన ఇతర స్టాక్స్‌గా గమనించవచ్చు. క్యు2 నడుస్తోన్న సమయంలోనే గోయెల్ అమర్‌జ్యోతి స్పిన్నింగ్ మిల్స్‌లో తన వాటాని 4.65శాతం నుంచి 2.96శాతానికి తగ్గించుకున్నారు. అలానే తిరుమలై కెమికల్స్‌లో కూడా 2.25శాతం నుంచి 2.11శాతానికి వాటా తగ్గించుకున్నారు.
ఎక్కువ వాటాలున్న కంపెనీల్లో ద్వారికేష్ షుగర్, జిఆర్‌పి, ఇండ్‌సిల్ హైడ్రో, ఎల్‌జి బాలకృష్ణన్, పనామా పెట్రోకెమ్, టిసిపిఎల్ ప్యాకేజింగ్, టెక్నోక్రాఫ్ ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. ఒక్క ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్‌లో గోయెల్‌కి 4.21శాతం, ఆయన భార్య సీమా గోయెల్‌కి 1.60శాతం వాటా ఉండడం గమనార్హం. అలాగని గోయెల్ స్టాక్స్‌లో నష్టాలు రాని కంపెనీలూ లేవని కాదు. కేజి డెనిమ్, సంఘ్వి మూవర్స్, శాంటెక్స్ ఫ్యాషన్ 5శాతం నుంచి 40శాతం వరకూ అనిల్ కుమార్ గోయెల్‌కి నష్టాలు చవి చూపించాయ్. ఎలాగైనా స్మాల్‌క్యాప్‌లోనే తన వెల్త్ క్రియేట్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇలాంటి ఏస్ ఇన్వెస్టర్లు ఏదైనా స్టాక్ కొన్నారంటే చాలు ఇతర ట్రేడర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు..ఐతే మార్కెట్ల విషయంలో బాగా ఓర్పు వేచిచూసే సహనం కావాలి.  లాబాలు వచ్చే వరకూ ఎదురుచూడగల ఆర్ధిక నేపధ్యం ఉండాలి. అప్పుడే మంచి రిటర్న్స్ దక్కుతాయిMost Popular