బయోకాన్ స్పీడ్‌కి రీజన్ ఇదే..అప్రూవల్ దక్కిన డ్రగ్ పొటెన్షియల్ చూడండి

బయోకాన్ స్పీడ్‌కి రీజన్ ఇదే..అప్రూవల్ దక్కిన డ్రగ్ పొటెన్షియల్ చూడండి

ఫార్మా కంపెనీ బయోకాన్ ఇవాళ ఇంట్రాడేలో మంచి స్పీడ్ కనబరిచింది. క్యేన్సర్ డ్రగ్‌ హెర్‌సెప్టిన్‌కి బయోసిమిలర్ తయారు చేసింది ఈ కంపెనీ. దానికి యూఎస్ ఎఫ్‌డిఏ అప్రూవల్ దక్కడంతో షేరు ధర అమాంతంగా పెరిగిపోయి ఆల్ టైమ్ హై మార్క్‌ని(రూ.510) టచ్ చేసింది.  ఈ డ్రగ్‌ని మైలాన్ లేబరేటరీ, బయోకాన్ సంయుక్తంగా తయారు చేస్తున్నాయ్. మైలాన్ ఓగివ్రి పేరుతో హెర్‌సెప్టిన్‌కి బయోసిమిలర్ తయారు చేసింది.(బయోసిమిలర్ అంటే ఇతర కంపెనీలు అప్పటికే తయారు చేసిన ప్రత్యేకమైన మెడిసిన్ /  మందులను అదే కాంపోజిషన్‌లో సొంతంగా ఇతర కంపెనీలు తయారు చేయడమే. ఉదాహరణకు పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్‌లో ఉండేది ఒకటే మెడిసిన్ అయినా అనేక కంపెనీలు సొంతంగా తామే తయారు చేసుకుని అమ్మకాలు సాగిస్తుంటాయ్  ) హెర్‌సెప్టిన్ ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్‌ని ట్రీట్ చేసేందుకు వాడుతుంటారు..

బయోకాన్, మైలాన్ తయారు చేసిన ఒగివ్రి యూఎస్ మార్కెట్‌లోనే మొట్ట మొదటి బయోసిమిలర్. అమెరికాలో ఈ ఏడాది 2,50,000 బ్రెస్ట్ కేన్సర్ కేసులు నమోదు అవగా, స్టమక్ కేన్సర్(ఉదర కేన్సర్) 28,000 కేసులు వెలుగు  చూశాయ్. అంటే ఈ డ్రగ్ వాడకం ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తం బ్రెస్ కేన్సర్ కేసుల్లో 20నుంచి25శాతం HER2-పాజిటివ్ అనే రకపు కేన్సర్‌కి చెందినవిగా అమెరికాలో నిర్ధారిస్తున్నారు. ఇప్పుడు బయోకాన్-మైలాన్ సంయుక్తంగా తయారు చేసిన బయోసిమిలర్ ఈ రకపు కేన్సర్‌కి వాడేదే! అమెరికాలో హెర్‌సెప్టిన్ అమ్మకాల విలువ 200కోట్ల డాలర్లు అంటే రూ.12884కోట్ల రూపాయలు. ఇంత భారీ మార్కెట్ ఉన్న డ్రగ్‌కి అప్రూవల్ దక్కింది కాబట్టే  స్టాక్‌మార్కెట్‌లో బయోకాన్ కంపెనీ షేరులో ఇంత మొమెంటమ్ చూపించింది. ప్రస్తుతం బిఎస్ఈలో బయోకాన్ షేరు 9శాతం లాభపడి రూ.490.25వద్ద ట్రేడవుతోందిMost Popular