గెలిచే టీమ్‌తో ఉంటేనే లాభం..ఇదిగో ప్రూఫ్ ఒక్క నెలలోనే 50శాతం పెరిగిన స్టాక్స్ చూడండి

గెలిచే టీమ్‌తో ఉంటేనే లాభం..ఇదిగో ప్రూఫ్ ఒక్క నెలలోనే 50శాతం పెరిగిన స్టాక్స్ చూడండి

స్టే విత్ విన్నర్స్..బి విత్ లీడర్స్ జనరల్‌గా అనలిస్టులు చెప్పే మాట ఇది! అలా ఉంటే ఎలాంటి లాభముంటుందో నవంబర్ నెల చూపించింది.దాదాపు 100 స్టాక్స్ కొత్త రికార్డు ధరలను తాకగా, అవి ఈ నెలలోనే 50శాతం పెరగడం విశేషం

నవంబర్‌లో సెన్సెక్స్ 0.2శాతం నష్టాలను నమోదు చేయగా..కొన్ని మంచి స్టాక్స్ మాత్రం 50శాతం లాభాలను పంచి తమ సత్తా చాటాయ్. మొత్తం 120 స్టాక్స్ 52వారాల గరిష్టాలకు ఎగబాకగా, వాటిలో మిండా ఇండస్ట్రీస్ 53శాతం లాభాలతో అగ్రస్థానం అలరించింది. 8కె మైల్స్ 46శాతం ఇన్ఫీబీమ్ 33శాతం పెరిగిన రెండు మూడు స్థానాల్లో నిలిచాయ్. మిగిలినవాటిలో గల్ఫ్ ఆయిల్, రైన్ఇండస్ట్రీస్, రాడికో ఖైతాన్, టైటన్ , టిటాగర్ వేగన్స్, వక్రంజీ సాఫ్ట్, టాటా గ్లోబల్ బెవరేజెస్, బాల్‌కృష్ణ ఇండస్ట్సీస్, ఇండియన్ బ్యాంక్, విఐపి ఇండస్ట్రీస్ ఉన్నాయ్

కింద టేబుల్‌లో ఏ స్టాక్ ఎలా పెరిగిందో చూడండి


ఇక డిసెంబర్ ( నడుస్తోన్న నెల)విషయానికి వస్తే మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్‌బిఐ మీట్, గుజరాత్ ఎన్నికల ఫలితాలు, యూఎస్ ఫెడరల్ బ్యాంక్ మీటింగ్, ఆయిల్ ధరల్లో మార్పు ఇలాంటివి ప్రధానమైన అంశాల ఆధారంగా సూచీలు ఆటుపోటులకు లోనయ్యే అవకాశం కన్పిస్తోంది. నిఫ్టీకి 10, 350 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురవుతున్నా..అది కూడా అధిగమిస్తే, 10,409-10450 పాయింట్ల వద్ద బ్రేక్ అవుట్ లభించవచ్చంటున్నారు. 2017 కేలండర్ ఇయర్‌లో ఎస్ అండ్ పి బిఎస్ఈ 25శాతం పెరిగింది. అందుకే కాస్త కరెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు..ఐతే సెంటిమెంట్ పరంగా డిసెంబర్ నెల బుల్స్‌దే అని లెక్కలు చెప్తున్నాయ్. కానీ ఈ సెంటిమెంట్ ప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉందిMost Popular