లాస్ట్ వీక్ 15శాతం పెరిగిన పొరింజు స్టాక్ తెలుసా

లాస్ట్ వీక్  15శాతం పెరిగిన పొరింజు స్టాక్ తెలుసా

బెంచ్ మార్క్ ఈక్విటీ ఇండెక్స్ సెన్సెక్స్, నిఫ్టీ గత వారం 2శాతం వరకూ నష్టపోయాయ్. జిడిపి నంబర్లు చక్కగా ఉన్నా..ద్రవ్యలోటు మరింత పెరగడం ఈ నష్టాలకు కారణంగా చెప్తున్నారు. వారం మొత్తం మీద సెన్సెక్స్ 846 పాయింట్లు, నిఫ్టీ 267 పాయింట్లు పోయాయ్. కీలక మద్దతు స్థాయిలు కూడా బ్రేక్ అయ్యాయ్
ఈ సమయంలో ఏస్ ఇన్వెస్టర్ పొరింజు వేలియాత్ ఇన్వెస్ట్ చేసిన ఆగ్రోటెక్ ఫుడ్స్ ఐదు సెషన్లలో 17శాతం పెరగడం విశేషం. ఎందుకంటే ఇందులో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సంస్థలో వాటా పెంచుకుంటూ పోవడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. మెయిన్‌గా అగ్రోటెక్ ఫుడ్స్ వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు అమ్ముతుంది. శాంసంగ్ ఇండియా సెక్యురిటీస్ మాస్టర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(ఈక్విటీ) ఆగ్రోటెక్ ఫుడ్స్‌లో 2లక్షల షేర్లు కొనుగోలు చేసింది. ఒక్కో షేరుకి రూ.620.93పైసలు ధర పలికింది. ఈ షేరులో ఇంటలిజెన్స్ ఈక్విటీ ఫ్యామిలీ మెంబర్లకు 7.56శాతం వాటా ఉండటం విశేషం. ప్రతి క్వార్టర్‌లోనూ సేల్స్ వాటితో పాటే నికరలాభమూ పెంచుకుంటూ పోతోన్న ఆగ్రోటెక్ ఫుడ్స్ ఈక్విటీ షేర్ కేపిటల్ రూ.24.37కోట్లు మాత్రమే. కంపెనీ అప్పు రూ. 17.62కోట్లుగా కంపెనీ బ్యాలెన్స్ షీట్ చెప్తోంది. లేటెస్ట్ బుక్ వేల్యూ రూ.147.67 కాగా, ప్రైస్ టు బుక్ వేల్యూ (కంపెనీ) 4.2 మాత్రమే.  క్యు2లో రూ.8.60కోట్ల నికర లాభం ప్రకటించిన ఈ కంపెనీపై విదేశీ సంస్థలు కూడా కన్నేయడంతో స్టాక్ మొమెంటమ్ ఇంకొన్ని రోజులు సాగొచ్చని అంచనాలు ఉన్నాయ్. గత శుక్రవారం ట్రేడింగ్‌లో ఆగ్రోటెక్ ఫుడ్స్ 1.21శాతం నష్టపోయి రూ.618.75 వద్ద ముగిసింది

( పై స్టాక్‌ని కొనమని ప్రాఫిట్ యువర్ ట్రేడ్. ఇన్ రికమండ్ చేయడం లేదు)Most Popular