మంచి లాభాలు రావాలంటే ఈ 7 సూత్రాలు గుర్తుపెట్టుకోండి

మంచి లాభాలు రావాలంటే ఈ 7 సూత్రాలు గుర్తుపెట్టుకోండి

ఏ వయసులో ఇన్వెస్ట్‌మెంట్ లేదంటే పొదుపు చేయడం ప్రారంభించాలి..ఇది సంపాదన మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ఎదురయ్యే ప్రశ్నఆ మాటకి వస్తే అసలు సంపాదన లేకపోయినా తల్లిదండ్రులు ఇచ్చే డబ్బుని జాగ్రత్త చేసినా బాగానే సంపద వృధ్ది చేసుకోవచ్చు. గత కొద్ది కాలంగా యుక్తవయస్కులలోనూ ఈ ధోరణి పెరిగిపోయింది. ఎంతో కొంత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అనేది చేస్తున్నారు. ఐతే ఈ రకంగా మదుపు చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 7 సూత్రాలు చూడండి

1.  మొదట్లో కొద్దిగా కొద్దిగానే పెట్టుబడి పెట్టాలి
2. మొత్తం డబ్బులో ఎక్కువభాగం మ్యూచువల్ ఫండ్స్‌కి కేటాయించి, కొద్ది భాగమే ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టాలి
3. ఈటిఎఫ్, ఇండెక్స్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత  యాక్టివ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలి
4. తొలినాళ్లలో షార్ట్ టర్మ్ పెట్టుబడి పెట్టవద్దు. ఆప్షన్ల జోలికి అసలే పోవద్దు
5. కనీసం 15 సంస్థల్లో షేర్లు కొనుగోలు చేసేలా పోర్ట్ ఫోలియా విస్తరించుకోండి
6. ధనాన్నిఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టాలి
7. ప్రతి ఆర్డర్‌కి స్టాప్‌లాస్ కూడా ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి

 

ఆలస్యం అమృతం విషం
ఇక తొలిసారిగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వాళ్లు గుర్తుపెట్టుకోవాల్సింది, స్టాక్స్ గురించి ముందు తెలుసుకోవాలి ఎలాంటి స్టాక్స్ కొనాలి, ఫండమెంటల్స్ అంటే ఏంటి, ఎక్కడ వెతికితే ఇలాంటి విషయాలు తెలుస్తోయో నేర్చుకోవాలి. ఎంత త్వరగా పెట్టుబడి పెడితే అంత లాభమనే సంగతి గుర్తుంచుకోవాలి


నేర్చుకునే తత్వం ముఖ్యం
చదవడం అర్ధం చేసుకోవడం నేర్చుకోవాలి. బెంజమిన్ గ్రాహం, పీటర్ లించ్, రాబర్ట్, ఫిలిఫ్ ఫిషర్‌వంటి వారు  ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీలపై రాసిన పుస్తకాలు హోవార్డ్ మార్క్స్, వారెన్ బఫెట్స్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ పర్సనాలిటీలు రాసిన న్యూస్ లెటర్స్ చదివే అలవాటు చేసుకోవాలి. మనకు వచ్చే కేపిటల్ మార్కెట్ దలాల్ స్ట్రీట్ వంటి లోకల్ లీడింగ్ మేగజైన్లు చదువుతుండాలి. అలానే పెట్టుబడిని ఓ దీర్ఘకాలిక సాధనంగా చూడాలి. ఇది చాలా సహనంతో కూడుకున్న పని ఎందుకంటే కొన్న ప్రతి స్టాకూ వెంటనే పెరగదు. కొన్ని ఏళ్ల తరబడి విసిగిస్తాయి. కొన్ని వెంటనే పెరిగినా..తగ్గడం కూడా అదే స్థాయిలో జరుగుతుంటుంది. స్టాక్ మార్కెట్‌లో ప్రతి క్షణం ఓ పాఠం నేర్పుతుంటుంది. ట్యూషన్ ఫీజులతో ఇన్వెస్ట్‌మెంట్  పీఎఫ్ డబ్బుతో షేర్లు కొనడం వంటి పనులు చేయకూడదు.అలానే నష్టపోతోన్న షేర్లను పెరుగుతుందేమో అన్న దింపుడు కళ్లం ఆశతో అలానే అట్టిపెట్టుకోకుండా స్టాప్‌లాస్ స్ట్రిక్ట్‌గా మెయిన్‌టైన్ చేసి అమ్ముకోవాలి. లాభాలకూ ఓ పరిమితి పెట్టుకోవాలనే విషయం మరో గుర్తుంచుకోదగ్గ అంశం

 Most Popular