నెట్ న్యూట్రాలిటీతో ఏ షేర్లు పెరుగుతాయో తెలుసా

నెట్ న్యూట్రాలిటీతో ఏ షేర్లు పెరుగుతాయో తెలుసా

నెట్ న్యూట్రాలిటీ అప్పుడప్పుడూ పలకరిస్తోన్న పదం..అందరికీ అందుబాటులో ఇంటర్నెట్ అంటూ గతంలో ఫేస్‌బుక్ కూడా ఫ్రీబేసిక్స్ పేరుతో ఇలాంటి ప్రయత్నాలే ఇండియాలోనూ చేయబోయింది. ఐతే మోనోపలీకి దారి తీస్తుందంటూ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇప్పుడు మళ్లీ నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ కొన్ని సిఫార్సులు చేస్తుండటంతో ఈ ఇష్యూ తెరపైకి వస్తోంది. ఈ పరిణామాలు జియో, భారతి ఎయిర్‌టెల్‌కి లాభించేలా ఉన్నాయని విశ్లేషకులు ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు

ట్రాయ్ సిఫార్సులు 2016 ఫిబ్రవరి చట్టం ప్రకారం రకరకాల ఆఫర్లు ప్రకటించడం కూడా కుదరదు. ఐతే కంటెంట్ డెలివరీ చేసే నెట్‌వర్క్స్ మాత్రం ఈ నిబంధననుంచి మినహాయింపు ఉంది. అలా ఆ మార్గంలో జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు లాభపడబోతున్నాయ్. ఇవి అచ్చంగా ఇంటర్‌నెట్‌పై మాత్రమే వ్యాపారం చేయవు కాబట్టి..రెగ్యులర్ ఇంటర్నెట్ ప్రొవైడర్లకు పోటీ కాదు కాబట్టి ఈ మినహాయింపు దక్కినట్లు ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. జియోటివి, ఎయిర్ టెల్ వింక్ , మ్యూజిక్ వంటి ఓన్ కంటెంట్ సప్లై చేస్తుండటంతో జియో, ఎయిర్‌టెల్ ఈ విధమైన మినహాయింపులకు అర్హమైనాయి. కాబట్టి..ఇక నెట్ ఛార్జీలు వివిధ ఆఫర్లతో ఇవ్వడం వాటికి వీలు పడుతుంది. ఇదే కేవలం నెట్ సర్వీసులు మాత్రమే అందించే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకి మాత్రం ఇలాంటి వెసులుబాటు ఉండదు కాబట్టి భవిష్యత్తులో ఈ రెండు షేర్లు బాగా పెరుగుతాయని అంచనా. ఐతే ఇదే విధమైన పద్దతి కాల్ ఛార్జీల విషయంలో మాత్రం వర్తింపజేయకపోవడం గమనార్హం. నెట్ న్యూట్రాలిటీ విషయంలో రూల్స్ అతిక్రమిస్తే రోజుకి రూ.50వేల వరకూ కూడా జరిమానా విధిస్తామని ట్రాయ్ హెచ్చరించింది.ఇవాళ్టి ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.944.50వద్ద, భారతి ఎయిర్‌టెల్ రూ.495వద్ద ట్రేడవుతున్నాయ్(స్టోరీ రాసే సమయానికి)Most Popular