గ్యాస్‌ షేర్లు.. మస్త్‌మస్త్‌...!

గ్యాస్‌ షేర్లు.. మస్త్‌మస్త్‌...!

పలు బ్రోకింగ్‌ సంస్థలు, రీసెర్చ్‌ సంస్థలూ ఇటీవల గ్యాస్‌ కంపెనీల షేర్లు ఔట్‌పెర్ఫార్మ్‌ చేయనున్నట్లు పేర్కొనడంతో ఇన్వెస్టర్లు తాజాగా ఈ రంగంపై దృష్టి సారించారు. దీంతో బీఎస్‌ఈలో ఇంద్రప్రస్థ గ్యాస్‌(ఐజీఎల్‌) ప్రస్తుతం 4.35 శాతం జంప్‌చేసి రూ. 326 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 332 వరకూ ఎగసింది. ఈ బాటలో తొలుత రూ. 1151 వరకూ దూసుకెళ్లిన మహానగర్‌ గ్యాస్‌ 2 శాతం పుంజుకుని రూ. 1129 వద్ద  కదులుతోంది. ఇక గుజరాత్‌ గ్యాస్‌ సైతం 2.4 శాతం బలపడి రూ. 869 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 879 వరకూ ఎగసింది.
పలు సంస్థల కితాబు
మోతీలాల్‌ ఓస్వాల్‌, దోలత్‌ కేపిటల్‌ మార్కెట్‌, నిర్మల్‌ బంగ్‌ ఈక్విటీస్‌ తదితర సంస్థలు గ్యాస్‌ పంపిణీ సంస్థల ఆదాయాలు ఇకపై మరింత వృద్ధి బాటలో సాగే అవకాశమున్నట్లు భావిస్తున్నాయి. రేటింగ్ సంస్థ కేర్‌ సైతం సీఎన్‌జీ, నేచురల్‌ గ్యాస్‌కు డిమాండ్‌ ఊపందుకోనున్నట్లు అంచనా వేస్తున్నాయి. ఇటీవల పర్యావరణరీత్యా సుప్రీం కోర్టు ఫర్నేస్‌ ఆయిల్‌, పెట్‌ కోక్‌ వంటి కొన్ని ప్రత్యామ్నాయ ఇంధనాలను నిషేధించడం వంటి అంశాలు ఈ రంగానికి జోష్‌నివ్వనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బీఎస్-6 నిబంధనలు సైతం ఈ రంగానికి మద్దతివ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ రంగంలోని కంపెనీలు పటిష్ట బ్యాలన్స్‌ షీట్లను కలిగి ఉండటం.. నాయకత్వ స్థాయిని చేరుకోవడం, పటిష్ట క్యాష్‌ఫ్లోను సాధిస్తుండటం వంటి సానుకూలతలతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.Most Popular