ఆ రెండు దేశాల విద్యుత్ వినియోగం దాటేసిన బిట్‌కాయిన్ 

ఆ రెండు దేశాల విద్యుత్ వినియోగం దాటేసిన బిట్‌కాయిన్ 

బిట్ కాయిన్ ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతున్న పేరు ఇది. క్రిప్టోకరెన్సీగా పేరొందిన ఈ బిట్ కాయిన్ విలువ రోజు రోజుకి పెరుగుతోంది. పరిమిత సంఖ్యలో బిట్ కాయిన్‌లకు లిమిట్ విధించడం డిమాండ్ కి కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ 8000 డాలర్ల స్థాయికి చేరింది. సూపర్ కంప్యూటర్లలో డేటా మైనింగ్ ద్వారా స్రుష్టించే ఈ బిట్ కాయిన్ల కోసం మైనింగ్ ఎక్స్‌పర్ట్ లు ఎంత కరెంటు వినియోగిస్తున్నారో ముక్కున వేలేసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 దేశాలు ఏడాది మొత్తం వినియోగించే విద్యుత్ సగటు కన్నా బిట్ కాయిన్ మైనింగ్ కోసం వినియోగించే విద్యుత్ సగటే ఎక్కువగా ఉందని తేలింది. ప్రపంచంలో గరిష్ట సగటు విద్యుత్ వినియోగ దేశాల సంఖ్యలో బిట్ కాయిన్ మైనింగ్ సంఖ్య 62వ స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఈ ఏడాది నవంబర్ 22 నాటికి బిట్ కాయిన్ మైనింగ్ కోసం వినియోగించిన విద్యుత్ మొత్తం 29.51 టెర్రా వాట్లని బిట్ కాయిన్ ఎనర్జీ కంజప్షన్ ఇండెక్స్ తెలిపింది. ఈ ఏడాది చివరి వరకు ఇదే రేంజ్ లో బిట్ కాయిన్ మైనింగ్ చేస్తే సుమారు 38.36 టెర్రా వాట్ల వినియోగానికి చేరనుంది. అంతే గరిష్ట విద్యుత్ వినియోగ దేశాల పట్టికలో బిట్ కాయన్ వినియోగదారులను నిలబెడితే ఖచ్చితంగా 58వ స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే సాలీనా 23.79 టెర్రావాట్ల గరిష్ట విద్యుత్ వినియోగం జరిపే ఐర్లాండ్ కన్నా, ఏటా 11.24 టెర్రా వాట్ల విద్యుత్ వినియోగించే నార్త్ కొరియా కన్నా బిట్ కాయిన్ మైనింగ్ కోసమే ఎక్కువగా విద్యుత్ వినియోగం చేస్తున్నట్లు తేలింది. 

ఇంతేనా బిట్ కాయిన్ తరహాలో ఇటీవలే పుట్టుకొచ్చిన మరో క్రిప్టోకరెన్సీ ఇథీరియం మైనింగ్ కోసం సైతం ఈ ఏడాది ఇప్పటి వరకూ సుమారు 10.41 టెర్రవాట్ల విద్యుత్ వినియోగించారు. ఇది పరాగ్వే విద్యుత్ వినియోగం  కన్నా అధికమని తేలింది. 

మరోవైపు బిట్ కాయిన్ మైనింగ్ కోసం విచ్చలవిడిగా వినియోగిస్తున్న విద్యుత్ పట్ల పర్యావరణ ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే ఒక యూనిట్ విద్యుత్ తయారీ వల్ల సగటున 500 గ్రాములు కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతుంది. ఆ లెక్కన బిట్ కాయిన్ మైనింగ్ కోసం వినియోగించే విద్యుత్ వల్ల వెలువడే కార్బన్ డయాక్సైడ్ 14.75 మిలియన్ టన్నులతో సమానంగా నిపుణులు తేల్చారు. అయితే బిట్ కాయిన్ మైనింగ్ లో చైనా అగ్రస్థానంలో నిలవగా అమెరికా రెండో స్థానంలో ఉంది. మొత్తం బిట్ కాయిన్ మైనింగ్ లో 58 శాతం చైనాలో జరుగుతుండగా, అమెరికాలో 16 శాతం మాత్రమే బిట్ కాయిన్ మైనింగ్ జరుగుతోంది.   Most Popular