నెల రోజుల్లో రెట్టింపైన స్టాక్

నెల రోజుల్లో రెట్టింపైన స్టాక్

హెవీ ఇంజనీరింగ్ సెక్టార్ షేరైన యాక్షన్ కనస్ట్రక్షన్ ఇవాళ్టి ట్రేడింగ్‌లో కొత్త గరిష్టాన్ని తాకింది. రూ.156కి ఎగసిన ఈ షేరు, తాజా పెరుగుదలతో ఈ నెలలోనే 100శాతం పెరిగినట్లైంది. గత రెండువారాలనుంచీ 60శాతం పెరిగిన ఈ స్టాక్ ప్రైస్ మొమెంటమ్‌కి కారణం క్యు2లో అద్భుత ఫలితాలు ప్రకటించడమే.  సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో యాక్షన్ కనస్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్  రూ.11కోట్ల నికరలాభం ఆర్జించింది. ఇది గత ఏడాది ఇదే సమయంలో కేవలం రూ. 4కోట్లు మాత్రమే కావడం విశేషం.

నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయంలో 31శాతం గ్రోత్ నమోదు చేసి రూ.251కోట్ల ఆదాయం ఆర్జించిన యాక్షన్ కనస్ట్రక్షన్ గత ఏడాది క్యు2లో రూ.190కోట్ల ఆదాయం మాత్రమే రాబట్టగలిగింది.  నవంబర్ 15న ప్రమోటర్లైన విజయ్ అగర్వాల్( 60,000), సోరబ్ అగర్వాల్(26,000) ఇద్దరూ కలిసి 86వేల యాక్షన్ కనస్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ షేర్లు కొన్నారు. ఈ డీల్ తర్వాత వీరిద్దరి వాటా కంపెనీలో 41.31శాతం నుంచి 41.39శాతానికి పెరిగింది. ఓవరాల్‌గా కంపెనీలో ప్రమోటర్ల వాటా 73.1శాతంగా కొనసాగుతుండగా..కంపెనీ షేరు ధరలో మంచి ర్యాలీ కన్పిస్తోంది. గత నెలరోజుల నుంచి చూసుకుంటే రూ.72 నుంచి రూ.156.40కి జంప్ చేసింది. దీంతో 30 సెషన్లలోనే 115శాతం పెరిగినట్లైంది. ప్రస్తుతానికి యాక్షన్ కనస్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ రూ.152.65 వద్ద ట్రేడవుతోంది.
 Most Popular