ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌కు నిధుల దన్ను 

ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌కు నిధుల దన్ను 

అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు(క్విప్‌) ద్వారా నిధుల సమీకరణ చేపట్టిన వార్తలతో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ కౌంటర్‌ బలపడింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు 3.3 శాతం పెరిగి రూ. 295 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 296 వరకూ పుంజుకుంది.
రూ. 1528 కోట్లు
క్విప్‌ను విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా రూ. 1528 కోట్లను సమీకరించినట్లు ఎడిల్‌వీజ్‌ తాజాగా పేర్కొంది. 2007 డిసెంబర్‌లో ఐపీవో చేపట్టాక కంపెనీ తిరిగి నిధుల సమీకరణ చేపట్టడం ఇప్పుడే! నిధులను బిజినెస్‌ పటిష్టతకు వినియోగించనున్నట్లు ఎడిల్‌వీజ్‌ తెలియజేసింది.