మిశ్రమంగా ఆసియా మార్కెట్లు!

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు!

థాంక్స్‌ గివింగ్‌ డే సందర్భంగా గురువారం అమెరికా, జపాన్‌ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకావడంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. ఫెడరల్‌ రిజర్వ్‌ మినిట్స్‌ ద్వారా డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపు తప్పదన్న అంచనాలు పెరగడంతో బుధవారం ఆసియా మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ పాలసీ సమావేశాలలో ఫెడ్‌ ద్రవ్యోల్బణంపై కాస్త ఆందోళనను వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. మరోవైపు పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఆన్‌లైన్‌లో రుణాలందించే కంపెనీపై కఠిన నిబంధనలు విధించడంతో చైనా భారీగా నష్టపోయింది కూడా.  
మార్కెట్ల తీరిలా
ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌ 0.55 శాతం పుంజుకోగా.. సింగపూర్‌ 0.3 శాతం, కొరియా, థాయ్‌లాండ్‌ 0.1 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే ఇండొనేసియా,  చైనా, జపాన్‌ 0.4 శాతం స్థాయిలో వెనకడుగు వేశాయి. మిగిలిన మార్కెట్లలో తైవాన్‌ నామమాత్ర నష్టంతో కదులుతోంది.Most Popular