ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్ నిఫ్టీ) 4 పాయింట్ల నామమాత్ర క్షీణతతో 10,367 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. బుధవారం పటిష్ట లాభాలతో ముగిసిన మార్కెట్లు తిరిగి గురువారం కన్సాలిడేట్‌ అయ్యాయి. ఆద్యంతం స్వల్ప హెచ్చుతగ్గుల నడుమ కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 26 పాయింట్ల స్వల్ప లాభంతో 33,588 వద్ద నిలవగా.. నిఫ్టీ 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,349 వద్ద స్థిరపడింది. నేడు మార్కెట్లు మరోసారి కన్సాలిడేషన్‌ బాటనే అనుసరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 
నిఫ్టీ కదలికలు?
నిఫ్టీకి 10,313-10,276 పాయింట్ల వద్ద మద్దతు లభించగలదని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఇదే విధంగా 10,380-10,410 స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని అంచనా వేస్తున్నారు. గురువారం థాంక్స్‌ గివింగ్‌ డే సందర్భంగా అమెరికా, జపాన్‌ మార్కెట్లు పనిచేయలేదు.
ఎఫ్‌పీఐలు సైలెంట్‌
నగదు విభాగంలో గత మూడు రోజుల్లో రూ. 1,500 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం అమ్మకాలు ఆపి నామమాత్రంగా రూ. 73 కోట్లను ఇన్వెస్ట్‌  చేశారు. మరోవైపు గత 4 రోజుల్లో రూ. 3,600 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) గురువారం మరోసారి రూ. 222 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. Most Popular