లాజిస్టిక్స్ షేర్లలో లాభాలకు ఇవి ఫిక్స్

లాజిస్టిక్స్ షేర్లలో లాభాలకు ఇవి ఫిక్స్

లాజిస్టిక్ రంగానికి కేంద్రం మౌలికరంగ హోదా ఇవ్వడంతో ఈ రంగషేర్లపై ఇన్వెస్టర్ల కన్ను పడటం సహజం. ఐతే ఈ సెక్టార్ షేర్లు  కొన్ని ఇప్పటికే 200శాతం పెరిగినవి కూడా ఉన్నాయ్. దీంతో వేల్యేషన్స్ పరంగా ఈ షేర్ల అన్వేషణ కొనసాగుతోంది.జిఎస్టీ తర్వాత లాజిస్టిక్ షేర్లు లాభపడ్డాయ్..ఐతే అమలైన తర్వాత మాత్రం  ఆ లాభమంతా ఆవిరైపోయింది. ఇప్పుడు కొత్తగా మౌలికరంగహోదా రవాణారంగంలోని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలకూ వర్తింపజేయడంతో మళ్లీ ఈ షేర్లలో కదలిక ప్రారంభమైంది. ఎకనమిక్ గ్రోత్ కోసం ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ని లాజిస్టిక్స్ రంగానికి ఇవ్వడమనే అంశం అందరూ ఆహ్వానిస్తున్నారు. ఈ హోదాతో లాజిస్టిక్ కంపెనీలకు తక్కువ వడ్డీకే అప్పులు దొరుకుతాయ్. వాటితో తమ కంపెనీల మూలధనం పెంచుకోవడం, వ్యాపార విస్తరణ చేయడం వంటివి సదరు సంస్థలకు సాధ్యపడుతుంది. దేశంలో రవాణారంగం నుంచి ఎగుమతుల ఖర్చు చాలా ఎక్కువ. అదే ప్రపంచంలోని ఇతర దేశాల్లో అయితే ఎగుమతి ఖర్చులు చాలా తక్కువ. మొత్తం జిడిపిలో 13శాతం రవాణారంగం నుంచే చేకూరుతుంది. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న చర్యతో కనీసం 2శాతం రవాణా ఖర్చు తగ్గుతుందని ఇండస్ట్రీ  అంచనా.షేర్ల విషయానికి వస్తే..ఆర్షియా ఈ ఏడాదే ఇప్పటికే 220శాతం పెరిగింది.  టిసిఐ 92శాతం, బలూర్ఘాట్  టెక్నాలజీస్ 68శాతం లాభపడింది.. మరి ఈ సెక్టార్లో ఇంకా ఏషేర్లు పెరగడానికి వీలుందో చూద్దాం

నవ్‌కార్ కార్పొరేషన్: టార్గెట్ రూ.217
నవ్‌కార్ కార్పొరేషన్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఆపరేషన్లు చేస్తోంది . కార్గో హ్యాండ్లింగ్, కార్గో స్టోరేజ్ , మెయిన్ టెనెన్స్ తో పాటు కంటైనర్ల రిపేర్లు కూడా నవ్ కార్ చేపడుతోంది. పాన్వెల్ దగ్గర ఏర్పాటు చేసిన 6 ఆర్‌టిజిసిలు సంస్థ కెపాసిటీని 5లక్షల ట్వెంటీ ఫుట్ ఈక్విలెంట్స్‌కి పెంచింది.. .20 అడుగుల పొడవు 8 అడుగుల ఎత్తు ఉన్న కంటైనర్ కెపాసిటీని ట్వెంటీ ఫుట్ ఈక్విలెంట్గా పిలుస్తారు. దీంతో రానున్న రెండేళ్లలో కంపెనీ సిఏజిఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) 35శాతం పెరుగుతుందని అంచనా వాపి దగ్గర రైల్ ఆపరేషన్లు కూడా సంస్థ ఆదాయన్ని పెంచనుంది

టిసిఐ: టార్గెట్ రూ.660
మోస్ట్ అండర్‌ఫెర్మాఫ్డ్ సెక్టార్‌గా లాజిస్టిక్స్‌ని ఇప్పటిదాకా చూస్తుండగా..జిఎస్టి, మౌలికరంగహోదా తర్వాత టిసిఐ ఎక్స్‌ప్రెస్ బాగా లాభపడుతుందని అంచనా. 4వేల అద్దె కంటైనర్లు, 550 బ్రాంచ్ ఆఫీసులతో టిసిఐ 40వేల ప్రాంతాలకు తన వ్యాపారాన్ని విస్తరించింది. తక్కువ అప్పు ఉండటం కంపెనీకి కలిసి వచ్చే మరో అంశం. 2500 ఫీడర్ రూట్లు, 400 ఎక్స్‌ప్రెస్ రూట్లు..28 సార్టింగ్ సెంటర్లతో టిసిఐ ఓ లాజిస్టిక్స్ హబ్‌లా తన వ్యాపారాన్ని విస్తరించుకుంది. రానున్న నాలుగైదేళ్లలో రూ.300కోట్లు ఇందుకోసమే ఖర్చు పెట్టనున్నట్లు ఐసిఐసిఐ డైరక్ట్ చెప్తోంది. తన దగ్గరున్న నిధుల్లో సగం సరుకు హ్యాండ్లింగ్ కెపాసిటీ పెంచుకునేందుకే ఖర్చు పెట్టనుండటం మరో విశేషం. ఎర్నింగ్ పర్ రూ.22గా నమోదు అవుతుందనే అంచనాతో రూ.660ని తాకుతుందని అంచనా

గతి : టార్గెట్ రూ.155
లార్జ్ స్కేల్, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్‌లో గతి టాప్ ప్లేయర్. జిఎస్టీతో ఇలాంటి కంపెనీలపై పన్నుభారం తగ్గిస్తుందని అంచనా..అందుకో ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గతికి ఇది లాభించే పరిణామం. ప్రమోటర్ స్టేక్ ఈ మధ్యనే 7.3శాతం తగ్గించుకోగా..వ్యూహాత్మక భాగస్వాముల కోసం కంపెనీ వేట ప్రారంభించింది. రానున్న రోజుల్లో వ్యాపారాన్ని విడదీసే అవకాశాలు ఉన్నాయ్. ఈ నేపధ్యంలో కంపెనీ షేరు రానున్న రోజుల్లో రూ.155కి పెరగొచ్చని ఐసిఐసిఐ డైరక్ట్ సూచిస్తోంది

విఆర్ఎల్ లాజిస్టిక్స్:  టార్గెట్ రూ.422
విఆర్ఎల్ లాజిస్టిక్స్ క్యు2 ఫలితాలు అంచనాకి తగ్గట్లే ఉండటంతో షేర్ రైట్ ట్రాక్‌లో ఉన్నట్లే భావించాలి. నికరలాభం రూ.21కోట్లకిపైనే నమోదైంది. డోలట్ కేపిటల్ అంచనా ప్రకారం షేరులో త్వరలోనే ర్యాలీ రావచ్చని తెలుస్తోంది. బై బ్యాక్‌తో షేర్ హోల్డర్ల వేల్యూ పెరుగుతుండగా, 4-7శాతం రెవెన్యూ గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. 

ఆల్‌కార్గో లాజిస్టిక్స్: టార్గెట్ రూ.190
అల్‌కార్గో క్యు2లో ఫ్లాట్ రిజల్ట్స్ ప్రకటించినా..మౌలికరంగహోదాతో సెంటిమెంట్ బాగుపడే అవకాశమున్నట్లు ఆంటిక్ స్టాక్ బ్రోకింగ్ తెలిపింది. గతంలో ఇదే స్టాక్‌కి ఆంటిక్ రూ.195 టార్గెట్ ప్రైస్ ఫిక్స్ చేసినా..లాభదాయకత తగ్గడంతో దాన్ని రూ.190కి తగ్గించింది. లాజిస్టిక్ సెక్టార్ కేంద్రం ఇచ్చిన తాజా హోదాతో ఈ షేర్లే కాకుండా మిగిలిన కంపెనీలు కూడా వృధ్ది బాటన పడతాయని అంచనాలున్నాయ్Most Popular